గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Anubhavinchu Raja Movie Review : అనుభ‌వించు రాజా.. మూవీ రివ్యూ..!

Anubhavinchu Raja Movie Review : ఈ వారం ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు థియేట‌ర్స్‌లోకి వ‌చ్చిన చిత్రం అనుభ‌వించు రాజా. ఇందులో రాజ్ తరుణ్, కాశీష్ ఖాన్, పోసాని కృష్ణ మురళి, ఆడుకలం నరేన్, అజయ్, రవి కృష్ణ, సుదర్శన్,…

Anubhavinchu Raja Movie Review : అనుభ‌వించు రాజా.. మూవీ రివ్యూ..!

Anubhavinchu Raja Movie Review : ఈ వారం ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు థియేట‌ర్స్‌లోకి వ‌చ్చిన చిత్రం అనుభ‌వించు రాజా. ఇందులో రాజ్ తరుణ్, కాశీష్ ఖాన్, పోసాని కృష్ణ మురళి, ఆడుకలం నరేన్, అజయ్, రవి కృష్ణ, సుదర్శన్, టెంపర్ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ, అరియానా ముఖ్య పాత్ర‌లు పోషించారు. శ్రీను గవిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకి గోపి సుంద‌ర్ సంగీతం అందించారు. హిట్స్ లేక బాధ‌ప‌డుతున్న రాజ్ త‌రుణ్‌కి ఈ సినిమా విజ‌యాన్ని అందించిందా.. లేదా.. అన్న‌ది చూద్దాం.

Anubhavinchu Raja Movie Review

హైదరాబాద్ లో ఓ సెక్యూరిటీ గార్డ్ గా రాజు (రాజ్ తరుణ్) చిన్నపాటి ఉద్యోగం చేస్తూ బ్రతుకుతాడు. ఈ సమయంలోనే సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ అయిన హీరోయిన్ కాశీష్ ఖాన్ తో ప్రేమలో పడతాడు. అయితే ఇక్కడ నుంచి తన లైఫ్ లో కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. అతనికి ఎదురైన సవాళ్లు ఏమిటి ? అతడిని చంపే వరకు పరిస్థితులు ఎలా మారుతాయి ? అనేది వెండితెరపై చూడాల్సిందే.

కామెడీని ఇష్ట‌ప‌డే వారికి చిత్రం బాగానే న‌చ్చుతుంది. రాజ్ త‌రుణ్ సినిమాలో న‌ట‌న‌తో పాటు కామెడీ కూడా పండించాడు. సెక్యూరిటీ గార్డుగా పల్లెటూరులో సరదా యువకుడిగా సెటిల్డ్ పెర్ఫామెన్స్ కనబరిచాడు. ఇక హీరోయిన్ కాశీష్ ఖాన్ లుక్స్ కానీ, డైలాగ్ డెలివరీ, నడవడిక అంతా నీట్ గా కనిపించాయి. హీరో, హీరోయిన్స్ మ‌ధ్య కెమిస్ట్రీ బాగుంది. సుద‌ర్శ‌న్ కామెడీ బాగుంది.

సినిమా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఫర్వాలేదు అనిపించినా తర్వాత కనిపించే భాగం అంతా కాస్త సంబంధ రాహిత్యంగా అనిపిస్తుంది. ఒక సరైన ఫ్లో లేకుండా విలేజ్ డ్రామాలోకి తీసుకెళ్లినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్ కాస్త ఎక్కువ గానే ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. ఇంకో పెద్ద మైనస్ ఏమిటంటే క్యాస్టింగ్ పరంగా లోపం కనిపిస్తుంది.

రవి, అరియనా లాంటి వాళ్ళని పెట్టుకున్నా వాళ్లకి డిజైన్ చేసిన పాత్రలు, వాటి ఎమోషన్స్ ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేకపోవడం గమనార్హం. అలాగే రాజ్ తరుణ్, అజయ్ ల మధ్య ఎపిసోడ్స్ కూడా ఏమంత ప్రభావవంతంగా అనిపించవు. రాజ్ తరుణ్ పాత్రకి సంబంధించి డీటెయిల్స్ కూడా అంత అర్ధవంతంగా ఉండవు. చిత్రంలో నిర్మాతల నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయని చెప్పాలి. గోపి సుందర్ ఇచ్చిన స్కోర్ కానీ, పాటలు కానీ ఆకట్టుకుంటాయి.

“అనుభవించు రాజా” అక్కడక్కడా నవ్వుకోడానికి బాగానే ఉంటుంది. కథలో కొత్తదనం లేకపోవడం, సరైన ఎమోషన్స్ లోపం.. వంటివి నిరాశపరుస్తాయి. ఫస్ట్ హాఫ్ వరకు ఫర్వాలేదు, కానీ సెకండాఫ్ మాత్రం కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి