Evaru Meelo Koteeshwarulu : యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం విశేష ఆదరణ దక్కించుకుని దూసుకుపోతోంది. మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో కోటి రూపాయలను గెలుచుకున్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఈ కార్యక్రమానికి కేవలం కంటెస్టెంట్లు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా హాజరవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, సమంత, డైరెక్టర్ కొరటాల శివ, రాజమౌళిలు హాజరై ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచారు. ఇక ఈ కార్యక్రమానికి మహేష్ బాబు వస్తున్నారు అంటూ గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కార్యక్రమం త్వరలోనే ప్రసారం కానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహేష్ ఎంతో అద్భుతంగా గేమ్ ఆడారని తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు ఈ కార్యక్రమం ద్వారా 25 లక్షల రూపాయలను గెలుచుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కానుందని తెలియడంతో మహేష్ అభిమానులు, అటు ఎన్టీఆర్ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇద్దరు స్టార్ సెలబ్రిటీలు ఒకే వేదికపై సందడి చేస్తుంటే ఈ కార్యక్రమం రేటింగ్స్ కూడా అమాంతం పెరిగిపోతాయని చెప్పవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…