Tamannaah : త‌మ‌న్నాతో గొడ‌వ‌.. అస‌లు విష‌యం చెప్పేసిన ఎఫ్3 డైరెక్ట‌ర్‌..!

June 6, 2022 11:08 AM

Tamannaah : వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో.. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమా.. ఎఫ్3. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. రికార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ను వ‌సూలు చేస్తోంది. దీంతో సినిమా రూ.100 కోట్ల క్ల‌బ్‌లోనూ చేరింది. ఇక త్వ‌ర‌లోనే బ్రేక్ ఈవెన్ కూడా సాధించ‌నుంది. ఎఫ్2 క‌న్నా భారీ స్థాయిలో ఈమూవీ స‌క్సెస్ కావ‌డంతో చిత్ర యూనిట్ ఎంతో సంతోషం వ్య‌క్తం చేస్తోంది. అందులో భాగంగానే చిత్ర బృంద స‌భ్యులు స‌క్సెస్ వేడుక‌ల్లో మునిగి తేలుతున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ కు ముందు ప్ర‌మోష‌న్ల‌లో త‌మ‌న్నా ఎక్క‌డా కనిపించ‌లేదు. దీంతో చిత్ర యూనిట్‌కు, త‌మ‌న్నాకు మ‌ధ్య గొడ‌వ జ‌రిగింద‌ని అంద‌రూ అనుకున్నారు. ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ కూడా స్పందించ‌లేదు. అయితే ఇదే విష‌యంపై అనిల్ రావిపూడి స్పందించారు.

త‌మ‌న్నాతో గొడ‌వ ఏమైనా ప‌డ్డారా.. ఆమె చిత్ర రిలీజ్‌కు ముందు జ‌రిగిన ప్ర‌మోష‌న్ల‌లో ఎందుకు పాల్గొన‌లేదు.. అని ప‌లువురు ప్ర‌శ్నించ‌గా.. అందుకు ఎఫ్3 ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. అలా ఏమీ లేదు, అవ‌న్నీ పుకార్లే, వాస్త‌వానికి త‌మ‌న్నా ఆ సమ‌యంలో కేన్స్ ఉత్స‌వాల్లో బిజీగా ఉంది. క‌నుక‌నే ఆమె ప్ర‌మోష‌న్ల‌కు రాలేదు.. అని అనిల్ రావిపూడి చెప్పారు.

Anil Ravipudi given clarity on issues with Tamannaah
Tamannaah

అయితే అంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. సోష‌ల్ మీడియా అయితే చేతిలో ఉందిగా.. మ‌రి సినిమా రిలీజ్ అయ్యే స‌మ‌యంలో క‌నీసం అందులో అయినా ఒక పోస్ట్ పెట్ట‌వ‌చ్చు క‌దా. త‌మ‌న్నా క‌నీసం ఆ ప‌ని కూడా చేయ‌లేదు. అంటే.. సోష‌ల్ మీడియాను వాడేంత స‌మ‌యం కూడా త‌మ‌న్నాకు దొర‌క‌లేదా.. అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. ఏది ఏమైనా.. అనిల్ రావిపూడి స‌మాధానం చెప్పారు కానీ.. అది అంత సంతృప్తిగా లేదు. మ‌రి ముందు ముందు దీనిపై క్లారిటీ ఏమైనా వ‌స్తుందేమో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment