Mutton : ప్రస్తుతం చికెన్ రేటు ఏమోగానీ మటన్ రేటు అయితే కొండెక్కి కూర్చుంది. మటన్ తిందామంటేనే గుండె గుభేల్ మనేట్లు రేట్లు ఉన్నాయి. కేజీకి దాదాపుగా రూ.700 నుంచి కొన్ని చోట్ల రూ.800 వరకు మటన్ ధర పలుకుతోంది. ఇక గొర్రె పొట్టేలు అయితే రూ.500 వరకు ధర ఉంటోంది. కానీ అక్కడ మాత్రం దాన్ని కేవలం రూ.50కే విక్రయించారు. అవును.. ఇది నిజమే..
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పీలేరు వాల్మీకిపురంలో మాంసం విక్రయదారులు పోటీలు పడి మరీ మటన్‌ను అమ్మారు. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా మటన్ ధర అమాంత పడిపోయింది. కిలో పొట్టేలు లేదా మేక మాంసం ఏది కొన్నా సరే కేవలం రూ.50కే ఇచ్చారు. దీంతో ప్రజలు పోటీలు పడి మరీ ఒక్కొక్కరు 5 నుంచి 10 కిలోల వరకు మటన్ కొనేశారు.
స్థానికంగా ఉన్న గాంధీ బస్ స్టాండ్ వద్ద ఓ దుకాణదారుడు ముందుగా రూ.300కు కిలో మటన్ అని బోర్డు పెట్టాడు. దీంతో ప్రజలు ఎగబడి కొన్నారు. అయితే అతన్ని చూసిన ఇతర షాపుల వారు సైతం పోటీలు పడి మరీ మటన్ ధరలను ఒకేసారి తగ్గిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ధర రూ.300 నుంచి రూ.200, రూ.100కు పడిపోయింది. తరువాత ఒక దశలో ఒక దుకాణదారుడు కేవలం రూ.50 కే కిలో మటన్ ఇస్తానని చెప్పడంతో ప్రజలంతా అటు పరుగులు తీశారు. పెద్ద ఎత్తున మటన్‌ను కొన్నారు. దీంతో రాత్రి 7.30 గంటల వరకు మాంసం మొత్తం అమ్ముడు పోయింది. దుకాణదారులు పోటీ పడి మరీ ధరలను తగ్గించడంతోనే ఈ విధంగా స్పందన లభించిందని అంటున్నారు.
అయితే అక్కడ నిజానికి ఇతర ప్రాంతాలతో పోలిస్తే గత వారం పది రోజుల నుంచి మటన్ ధరలు తక్కువే ఉన్నాయి. కిలో మటన్‌ను రూ.400కు విక్రయిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లోని మటన్ ధరతో పోలిస్తే ఇది తక్కువే కావడం విశేషం. కానీ చికెన్ మాత్రం కేజీకి రూ.160 చొప్పున యథావిధిగా అమ్ముడైంది. ధర తగ్గలేదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…