Jobs : ఏపీపీఎస్సీ ఆయుష్ విభాగంలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..!

September 27, 2021 5:03 PM

Jobs : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ (APPSC) నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఆయుష్ విభాగంలో ఖాళీగా ఉన్న 151 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. యూనాని, హోమియో విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ ఉద్యోగాలకు ఈడబ్ల్యూఎస్‌ అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Jobs : ఏపీపీఎస్సీ ఆయుష్ విభాగంలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..!

ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 4వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 42 సంవత్సరాలకు మించి ఉండకూడదు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఆయుర్వేదం, యునానీ, హోమియోలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సంవత్సరం పాటు ఇంటర్న్‌షిప్ చేయడంతోపాటు దరఖాస్తు చేస్తున్న విభాగంలో మెడికల్ ప్రాక్టీస్‌నర్‌గా రిజిస్టర్ అయి ఉండాలి.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేదం 72, మెడికల్ ఆఫీసర్‌ యునానీ 26, మెడికల్ ఆఫీసర్‌ హోమియో 53 పోస్టులను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు https://psc.ap.gov.in/ అనే అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించి తెలుసుకోవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now