నేతన్న నేస్తంతో చేనేత కార్మికుల‌కు ఉపాధి.. సీఎం జ‌గ‌న్‌కు నేత‌న్న‌ల ధ‌న్య‌వాదాలు..

August 7, 2021 2:18 PM

అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి సీఎం జ‌గ‌న్ అనేక ప‌థ‌కాలను ఏపీలో అమ‌లు చేస్తున్నారు. వాటిల్లో నేత‌న్న నేస్తం ప‌థ‌కం కూడా ఒక‌టి. దీని ద్వారా చేనేతపై ఆధారపడిన వేలాది కుటుంబాలకు ఉపాధి ల‌భిస్తోంది. ఈ ప‌థ‌కం కింద ఇప్ప‌టికే 81వేల మందికి పైగా రూ.383 కోట్ల‌ను అందించారు. దీంతో చేనేత కార్మికుల బతుకులు బాగుప‌డుతున్నాయి.

chenetha karmikula thanks to cm ys jagan

వైఎస్సార్‌ నేతన్న నేస్తం ద్వారా ఎంతో మంది చేనేత కార్మికుల‌కు ఉపాధి ల‌భిస్తోంది. ఈ క్ర‌మంలోనే జాతీయ చేనేత దినోత్స‌వం సంద‌ర్భంగా చేనేత కార్మికులు సీఎం జ‌గ‌న్‌ను త‌ల‌చుకుంటున్నారు. వైఎస్సార్ లాగే ఆయ‌న త‌న‌యుడు కూడా ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందుతున్నార‌ని చేనేత కార్మికులు అంటున్నారు.

వైఎస్సార్‌ నేతన్న నేస్తం ద్వారా ఇప్ప‌టికే 2 సార్లు స‌హాయం అందించారు. ఇక మూడో సారి కూడా స‌హాయం చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంల‌నే ఒక్కొక్క కార్మికుడికి రూ.24 వేల చొప్పున స‌హాయం అందించ‌నున్నారు. అలాగే కోవిడ్ వ‌ల్ల చేనేత సొసైటీల్లో పేరుకుపోయిన వస్త్రాలను ఆప్కో ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణ‌యించారు. ఆర్గానిక్‌ వస్త్రాల తయారీ, కొత్త కొత్త డిజైన్లు వంటి అనేక వినూత్న ప్రయోగాలతో చేనేత రంగానికి మరింత ఊతమిచ్చేలా ఆప్కో ద్వారా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్ర‌మంలోనే సీఎం జ‌గ‌న్‌ను పొగుడుతూ అభిమానులు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now