Andhra Pradesh : ఏపీలో పండుగ చేసుకుంటున్న మ‌ద్యం ప్రియులు.. త‌గ్గిన ధ‌ర‌ల వివ‌రాలు ఇవే..!

December 20, 2021 10:27 AM

Andhra Pradesh : ఏపీలో ఒక క్ర‌మ ప‌ద్ధ‌తిలో సంపూర్ణంగా మ‌ద్య నిషేధాన్ని అమ‌లు చేస్తామ‌ని ప్ర‌భుత్వం చెప్పిన విష‌యం విదిత‌మే. అయితే అందులో భాగంగానే ఎప్ప‌టిక‌ప్పుడు మ‌ద్యం ధ‌ర‌ల‌ను పెంచుతూ.. మ‌ద్యం దుకాణాలు, బార్ల‌ను త‌గ్గిస్తూ వ‌చ్చిన ఏపీ ప్ర‌భుత్వం తాజాగా షాకిచ్చింది. మ‌ద్యం ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తున్న‌ట్లు తెలిపింది. దీంతో మ‌ద్యం ప్రియులు పండుగ చేసుకుంటున్నారు. ఇక త‌గ్గిన ధ‌ర‌లు ఆదివారం నుంచే అందుబాటులోకి వ‌చ్చాయి.

Andhra Pradesh government reduced liquor rates news rate are here

ఏపీలో మ‌ద్యం ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తున్న‌ట్లు శ‌నివార‌మే ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌జ‌త్ భార్గ‌వ తాజాగా ఉత్త‌ర్వుల‌ను జారీ చేశారు. ఇక త‌గ్గిన మ‌ద్యం ధ‌ర‌ల వివ‌రాల‌ను కింద ప‌ట్టిక‌ల‌ను చూసి తెలుసుకోవ‌చ్చు.

రాష్ట్రంలో వ‌చ్చే వారంలోపు అన్ని మ‌ద్యం దుకాణాల్లోనూ ప్ర‌ముఖ కంపెనీల‌కు చెందిన మ‌ద్యం బ్రాండ్ల‌ను విక్ర‌యించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కూడా ఏపీ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఏపీలో మ‌ద్యం వినియోగం త‌గ్గింద‌ని చెబుతున్న ప్ర‌భుత్వం ఉన్న ఫ‌లంగా ఇలా మ‌ద్యం ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌డం వెనుక ఉన్న ఆంత‌ర్య‌మేమిట‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. ఇలా మ‌ద్యం ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తే మ‌ళ్లీ మ‌ద్యం వినియోగం పెరుగుతుంది క‌దా.. అని అంటున్నారు. మ‌రి మ‌ద్య నిషేధాన్ని అమ‌లు చేయాల‌న్న ఏపీ ప్ర‌భుత్వం స‌డెన్‌గా మ‌ద్యం ధ‌ర‌ల‌ను ఎందుకు త‌గ్గించిందో.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటో.. అందుకు కాల‌మే స‌మాధానం చెప్పాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now