Anda Keema Curry : అండా కీమా క‌ర్రీ.. వంట రాని వారు కూడా ఈజీగా చేయొచ్చు.. రుచి అమోఘం..

Anda Keema Curry : కోడిగుడ్లు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. కోడిగుడ్ల‌ను అనేక ర‌కాలుగా వండుకుని తింటుంటారు. కోడిగుడ్ల వేపుడు, బాయిల్డ్ ఎగ్స్‌, కోడిగుడ్డు ఆమ్లెట్‌, కోడిగుడ్డు ట‌మాటా.. ఇలా చాలా ర‌కాలుగా కోడిగుడ్ల‌ను చేయ‌వ‌చ్చు. అయితే కోడిగుడ్ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన అండా కీమా క‌ర్రీని కూడా చేయ‌వ‌చ్చు. ఇది అద్భుతంగా ఉంటుంది. చ‌పాతీల‌తో తింటే వ‌హ్వా అంటారు. దీన్ని త‌యారు చేయ‌డం కూడా సుల‌భమే. వంట‌రాని వారు కూడా దీన్ని ఈజీగా చేయ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే అండా కీమా కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అండా కీమా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన గుడ్లు – 3, గుడ్లు – 2, ఉల్లిపాయ – 1, ట‌మాటాలు – 2, కొత్తిమీర – 1 క‌ట్ట‌, ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి ముద్ద – 1 టేబుల్ స్పూన్‌, జీల‌క‌ర్ర – 1 టీస్పూన్‌, ప‌సుపు – పావు టీస్పూన్‌, కారం – 2 టీస్పూన్లు, ధ‌నియాల పొడి – 1 టీస్పూన్‌, పావ్ భాజీ మ‌సాలా – 1 టీస్పూన్‌, చాట్ మ‌సాలా – 1 టీస్పూన్‌, ఉప్పు – త‌గినంత‌, నూనె – 3 టేబుల్ స్పూన్లు.

Anda Keema Curry

అండా కీమా క‌ర్రీని త‌యారు చేసే విధానం..

స్ట‌వ్ మీద క‌డాయి పెట్టి నూనె వేసి జీల‌క‌ర్ర వేయించి త‌రువాత ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ త‌రుగు వేయాలి. అవి వేగాయ‌నుకున్న త‌రువాత అల్లం వెల్లుల్లి ముద్ద‌, కొత్తిమీర‌, ట‌మాటా ముక్క‌లు, త‌గినంత ఉప్పు వేయాలి. త‌రువాత ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి, పావ్ భాజీ మ‌సాలా, చాట్ మ‌సాలా వేసి క‌లిపి పావు క‌ప్పు నీళ్లు పోయాలి. ఇది కూర‌లా త‌యారై నూనె పైకి తేలాక ఉడికించిన గుడ్ల‌ను చేత్తో మెదిపి అందులో వేసి స్ట‌వ్ ని సిమ్‌లో పెట్టాలి. ఇప్పుడు మిగిలిన రెండు గుడ్ల సొన‌ను గిల‌కొట్టి కూర‌లో వేసి బాగా క‌లిపి 5 నిమిషాలు అయ్యాక దింపేయాలి. దీంతో ఎంతో రుచిక‌ర‌మైన అండా కీమా క‌ర్రీ రెడీ అవుతుంది. దీన్ని అన్నం లేదా చ‌పాతీలు దేంతో తిన్నా స‌రే ఎంతో రుచిగా ఉంటుంది. ఎప్పుడూ చేసే కోడిగుడ్ల కూర‌ల‌కు బ‌దులుగా ఈసారి ఇలా ట్రై చేయండి. అంద‌రూ ఇష్టంగా తింటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM