Urine Color : మన శరీరంలో ఎప్పటికప్పుడు వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయన్న సంగతి తెలిసిందే. అవి చెమట, మూత్రం, మలం రూపంలో బయటకు పోతాయి. ఈ వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లకపోతే మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. వ్యర్థాలు శరీరంలో పేరుకుపోయి శరీరం విషతుల్యంగా మారుతుంది. దీంతో మొదట చెడిపోయేది కిడ్నీలే. తరువాత ఇతర అవయవాలు కూడా పాడైపోతాయి. దీంతో ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడుతాయి. కనుక శరీరంలో వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా చూసుకోవాలి. అందుకు గాను ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవన విధానంను పాటించాలి.
అయితే మన శరీరం విడుదల చేసే వ్యర్థాల్లో ఒకటైన మూత్రం ద్వారా మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో ఇట్టే తెలుసుకోవచ్చు. మూత్రం వచ్చే రంగును బట్టి మనకు ఉన్న అనారోగ్య సమస్యల గురించి చెప్పేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మూత్రం లేత పసుపు రంగులో లేదా తెలుపు రంగులో వస్తుంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లే లెక్క. లేత బంగారు రంగు, నారింజ రంగు, ముదురు నారింజ రంగులలో మూత్రం వస్తుంటే మీరు నీళ్లను సరిగ్గా తాగడం లేదని అర్థం. మీరు రోజుకు సరిపడినన్ని నీళ్లను తాగితే మూత్రం ఇలా రాదు. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.
ఇక మూత్రం లేత గోధుమ రంగులో వస్తుంటే నీళ్లను ఇంకా ఎక్కువగా తాగాలని అర్థం. మూత్రం లేత ఎరుపు లేదా ఎరుపు రంగులో వస్తుంటే మీ కిడ్నీలు చెడిపోయాయని అర్థం. మీ కిడ్నీలపై భారం బాగా పడుతుందని అర్థం చేసుకోవాలి. లేదా ఏదైనా తీవ్రమైన అనారోగ్య సమస్య ఉన్నట్లు అనుమానించాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా సమస్య ఉన్నట్లు తేలితే డాక్టర్ సూచన మేరకు చికిత్స తీసుకోవాలి. దీంతో కిడ్నీలను కాపాడుకోవచ్చు. ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడకుండా ఉంటాయి. ఈ విధంగా మూత్రం రంగును బట్టి ముందుగానే స్పందిస్తే ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్య కూడా రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. దీని వల్ల ఆరోగ్యంగా ఉంటారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…