Sreemukhi : శ్రీ‌ముఖి రేంజ్ పెరిగిపోయిందిగా.. ఒక్క‌సారికే అంత రెమ్యున‌రేష‌నా..?

June 11, 2022 7:25 PM

Sreemukhi : బుల్లితెర యాంక‌ర్ల‌లో మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చే పేర్ల‌లో యాంక‌ర్ సుమ మొద‌టి స్థానంలో ఉంటుంది. అయితే సుమ త‌రువాత ఆ రేంజ్‌లో పాపుల‌ర్ అయిన యాంక‌ర్ ఎవ‌రు.. అంటే.. మ‌నకు గుర్తుకు వ‌చ్చేది శ్రీ‌ముఖినే అని చెప్ప‌వ‌చ్చు. యాంక‌ర్ సుమ లాగే శ్రీ‌ముఖి కూడా బాగా మాట్లాడ‌గ‌ల‌దు. ఈవెంట్ లేదా షో, ప్రోగ్రామ్ ఏదైనా స‌రే.. సుమ లాగే శ్రీ‌ముఖి సంద‌డి చేస్తుంటుంది. ముఖ్యంగా శ్రీ‌ముఖి యువ‌త‌కు బాగా క‌నెక్ట్ అయింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇప్ప‌టికే ప‌లు షోల ద్వారా శ్రీ‌ముఖి యూత్‌లో ఎంతో పాపులారిటీని ద‌క్కించుకుంది. అయితే రెమ్యున‌రేష‌న్ విష‌యంలోనూ సుమ‌కు పోటీగా శ్రీ‌ముఖి వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే ఆమె తాజాగా త‌న రెమ్యున‌రేష‌న్‌ను భారీగా పెంచిన‌ట్లు తెలుస్తోంది.

యాంక‌ర్ సుమ ఒక్క కాల్‌షీట్‌కు రూ.5 ల‌క్ష‌లు తీసుకుంటుండ‌గా.. ఆమె త‌రువాత రెండో స్థానంలో శ్రీ‌ముఖి నిలిచింద‌ని చెప్ప‌వ‌చ్చు. శ్రీ‌ముఖి ఒక్క కాల్‌షీట్‌కు రూ.3 ల‌క్ష‌ల వ‌ర‌కు డిమాండ్ చేస్తుంద‌ని స‌మాచారం. శ్రీ‌ముఖి త‌న వాక్చాతుర్యంతో ఇప్ప‌టికే ఎంతో మందిని ఆక‌ట్టుకుంది. సోష‌ల్ మీడియాలోనూ ఈమె ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. అయితే శ్రీ‌ముఖి యాంక‌ర్‌గానే కాదు.. ప‌లు సినిమాల్లోనూ న‌టించి మెప్పించింది. కానీ ఈమెకు సినిమాల ద్వారా అంత గుర్తింపు రాలేదు. షోల ద్వారానే బాగా గుర్తింపు వ‌చ్చింది.

Anchor Sreemukhi increased her remuneration
Sreemukhi

ఇక ప్ర‌స్తుతం బుల్లితెర టాప్ యాంక‌ర్ల‌లో సుమ‌, శ్రీ‌ముఖి, అన‌సూయ ఉన్నార‌ని చెప్ప‌వ‌చ్చు. కానీ అన‌సూయ టీవీ షోల‌లో త‌క్కువ‌గా సినిమాల్లో ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఇక సుమ‌, శ్రీ‌ముఖి మాత్ర‌మే టీవీ షోలలో బాగా క‌నిపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వారు ప్ర‌స్తుతం ప‌లు టీవీ షోల‌తో బిజీగా ఉన్నారు. అయితే శ్రీ‌ముఖి ఈ రేంజ్‌లో రెమ్యున‌రేష‌న్‌ను తీసుకుంటుండ‌డంతో ముందు ముందు ఈమె ఇంకా ఎంత డిమాండ్ చేస్తుందోన‌ని చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి ఈమెకు సినిమాల్లో ఏమైనా చాన్స్‌లు వ‌చ్చి ద‌శ తిరుగుతుందేమో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment