Anchor Ravi : బుల్లి తెరపై యాంకర్ రవి ఎంతో గుర్తింపును సొంతం చేసుకున్నాడు. అనేక షోలను చేస్తూ చక్కని పేరు పొందాడు. బుల్లి తెర ప్రేక్షకుల్లో రవి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక బిగ్ బాస్ 5 కంటెస్టెంట్‌గా కూడా హౌస్‌లో ఆకట్టుకుంటున్నాడు. దీంతో బిగ్ బాస్ విన్నర్ అవుతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
అయితే యాంకర్ రవికి చెందిన ఓ విషయం హాట్ టాపిక్‌గా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో చాన్స్ కోసం ఎంతో మంది పరితపిస్తుంటారు. అలాగే యాంకర్ రవికి కూడా ఆయన సినిమాలో చేసే అవకాశం వచ్చింది. అయినప్పటికీ రవి ఆ అవకాశాన్ని వదులుకున్నాడు. దీనికి కారణం కూడా ఉంది.
యాంకర్ రవి ఇప్పటికే బుల్లి తెరపై ఎన్నో షోలను చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో మహేష్ బాబుకు చెందిన మహర్షి మూవీలో నటించే అవకాశం లభించింది. అందులో మహేష్ పీఏగా రవిని తీసుకోవాలని అనుకున్నారట. అందుకు రవిని అడిగారట కూడా. కానీ రవి అందుకు ఒప్పుకోలేదు.
తాను బుల్లి తెర షోలతో బిజీగా ఉన్నానని, అయినా మహర్షి సినిమా లొకేషన్ ఊర్లో చాలా దూరంగా ఉంటుంది కనుక ఓ వైపు ఆ సినిమాలో చేస్తూ.. మరోవైపు టీవీ షోలలో పాల్గొనడం ఇబ్బందిగా ఉంటుందని, రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కష్టమని భావించానని.. అందుకనే మహేష్ అంతటి హీరో సినిమాలో అవకాశం వచ్చినా వద్దన్నానని రవి తెలిపాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…