Anchor Ravi : మ‌హేష్ బాబు సినిమాలో అవ‌కాశం వ‌చ్చినా చేయ‌ని ర‌వి.. కార‌ణం అదే..?

October 1, 2021 10:04 AM

Anchor Ravi : బుల్లి తెర‌పై యాంక‌ర్ ర‌వి ఎంతో గుర్తింపును సొంతం చేసుకున్నాడు. అనేక షోల‌ను చేస్తూ చ‌క్క‌ని పేరు పొందాడు. బుల్లి తెర ప్రేక్ష‌కుల్లో ర‌వి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక బిగ్ బాస్ 5 కంటెస్టెంట్‌గా కూడా హౌస్‌లో ఆక‌ట్టుకుంటున్నాడు. దీంతో బిగ్ బాస్ విన్న‌ర్ అవుతాన‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నాడు.

Anchor Ravi : మ‌హేష్ బాబు సినిమాలో అవ‌కాశం వ‌చ్చినా చేయ‌ని ర‌వి.. కార‌ణం అదే..?
Anchor Ravi

అయితే యాంక‌ర్ ర‌వికి చెందిన ఓ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సినిమాలో చాన్స్ కోసం ఎంతో మంది ప‌రితపిస్తుంటారు. అలాగే యాంకర్ ర‌వికి కూడా ఆయ‌న సినిమాలో చేసే అవ‌కాశం వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ ర‌వి ఆ అవ‌కాశాన్ని వ‌దులుకున్నాడు. దీనికి కార‌ణం కూడా ఉంది.

యాంక‌ర్ ర‌వి ఇప్ప‌టికే బుల్లి తెర‌పై ఎన్నో షోల‌ను చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్ర‌మంలో మ‌హేష్ బాబుకు చెందిన మ‌హ‌ర్షి మూవీలో న‌టించే అవ‌కాశం ల‌భించింది. అందులో మ‌హేష్ పీఏగా ర‌విని తీసుకోవాల‌ని అనుకున్నార‌ట‌. అందుకు ర‌విని అడిగార‌ట కూడా. కానీ ర‌వి అందుకు ఒప్పుకోలేదు.

తాను బుల్లి తెర షోల‌తో బిజీగా ఉన్నాన‌ని, అయినా మ‌హ‌ర్షి సినిమా లొకేష‌న్ ఊర్లో చాలా దూరంగా ఉంటుంది క‌నుక ఓ వైపు ఆ సినిమాలో చేస్తూ.. మ‌రోవైపు టీవీ షోల‌లో పాల్గొన‌డం ఇబ్బందిగా ఉంటుందని, రెండింటినీ బ్యాలెన్స్ చేయ‌డం క‌ష్ట‌మ‌ని భావించాన‌ని.. అందుకనే మ‌హేష్ అంత‌టి హీరో సినిమాలో అవ‌కాశం వ‌చ్చినా వ‌ద్ద‌న్నాన‌ని ర‌వి తెలిపాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now