Jabardasth : బుల్లితెర ప్రేక్షకులకు అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మొదట్లో సినిమాల్లోనే నటించేది. కానీ తరువాత బుల్లితెరకు మారింది. ఈక్రమంలోనే ఈమె బుల్లితెరపై సక్సెస్‌ఫుల్ యాంకర్‌గా మారింది. తరువాత మళ్లీ సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అందులోనూ సక్సెస్ అయింది. ఇక రంగస్థలం సినిమాలో ఈమె చేసిన రంగమ్మత్త పాత్ర ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. దీంతో ఈమెకు సినిమాల్లో వరుస ఆఫర్లు వస్తున్నాయి.
అలా అనసూయ సినిమాలతోపాటు బుల్లితెరపై కూడా ఎంతో పేరు తెచ్చుకుంది. మరోవైపు వరుస ఆఫర్లతో బిజీగా మారింది. అయితే ఈమెకు వస్తున్న సినిమా ఆఫర్ల కారణంగా జబర్దస్త్‌కు గుడ్‌బై చెప్పేసింది. జబర్దస్త్‌ను వీడుతుంటే చాలా బాధగా ఉందంటూ ఎమోషనల్ అయింది. అంతేకాకుండా తన కెరీర్‌లో అది చాలా కీలకమైన నిర్ణయమని.. ఆ తరువాత కూడా ప్రేక్షకులు తనకు సపోర్ట్‌గా ఉండాలని కోరింది. ఈ క్రమంలోనే జూలై 28వ తేదీన ప్రసారమైన జబర్దస్త్ ఎపిసోడ్ ఆమెకు ఆఖరిది. దీంతో అనసూయ తరువాత కొత్త యాంకర్‌ను కూడా తెచ్చారు.
కాగా అనసూయ తరువాత వచ్చే యాంకర్‌ను చూపించలేదు. అలా చూపించకుండానే తరువాతి జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమోను కట్ చేశారు. కొత్త యాంకర్‌ను చూపించకుండా పల్లకిలో తెచ్చారు. దీంతో ఆమె ఎవరు.. అనే విషయం తెలుసుకునేందుకు టీమ్ లీడర్స్ ఆసక్తిగా చూశారు. అయితే అనసూయ స్థానంలో యాంకర్ మంజూష వస్తుందని ఇదివరకే తెలిసింది. దీంతో ఆమెనే యాంకర్‌గా వచ్చి ఉంటుందని అంటున్నారు. ఇక జబర్దస్త్‌లో అనసూయ తరువాత వస్తున్న యాంకర్ ఎవరు.. అనే విషయాన్ని తెలుసుకోవాలంటే వచ్చే జబర్దస్త్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ ఎపిసోడ్ ఆగస్టు 4న ప్రసారం కానుంది. మరి కొత్త యాంకర్ ఎలా ఉంటుందో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…