Anchor Lasya : ప్రముఖ యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చీమ, ఏనుగు జోక్స్‌తో కూడా బాగా పాపులర్. యాంకర్‌గా స్టేజీపై ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆమె కొన్ని సినిమాల్లోనూ నటించి మెప్పించింది. కెరీర్లో కాస్త వెనకబడుతున్నానని అనుకున్న సమయంలో మంజునాథ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సొంత యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది.
ఇదిలా ఉంటే తాజాగా యాంకర్ లాస్య అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె భర్త సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. లాస్య హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఫోటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి. బెడ్ పై ఉన్న లాస్యకు వరుసగా సెలైన్ ఎక్కిస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ అసలు లాస్యకు ఏమైంది అన్న వియాన్ని ఆమె భర్త మంజునాథ్ వెల్లడించలేదు.
లాస్య హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉండగా ఒక వీడియో తీసిన ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో దాన్ని షేర్ చేస్తూ.. గెట్ వెల్ సూన్ అని రాసుకొచ్చాడు. దీంతో యాంకర్ లాస్యకు అసలు ఏం జరిగింది ? ఆమె ఎందుకు హాస్పిటల్లో జాయిన్ అయింది ? అంటూ ఆమె గురించి ఆమె అభిమానులు వాకబు చేస్తున్నారు. ఆమెకు జ్వరం వచ్చిందని, వైరల్ ఫీవర్ కావడంతోనే హాస్పిటల్లో జాయిన్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఆమె త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుతున్నారు. ఇంతకు లాస్యకు ఏమైంది అనేది ఆమె భర్త మంజునాథ్ స్పందిస్తే కానీ తెలీదు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…