Anchor Lasya : హాస్పిటల్ లో బెడ్‌పై యాంకర్‌ లాస్య.. ఇంత‌కీ అస‌లు ఏమైంది..?

September 4, 2022 3:35 PM

Anchor Lasya : ప్రముఖ యాంకర్‌ లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చీమ, ఏనుగు జోక్స్‌తో కూడా బాగా పాపుల‌ర్. యాంక‌ర్‌గా స్టేజీపై ఆమె చేసే సంద‌డి అంతా ఇంతా కాదు. బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆమె కొన్ని సినిమాల్లోనూ నటించి మెప్పించింది. కెరీర్లో కాస్త వెనకబడుతున్నానని అనుకున్న సమయంలో మంజునాథ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సొంత యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహిస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది.

ఇదిలా ఉంటే తాజాగా యాంకర్‌ లాస్య అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె భర్త సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. లాస్య హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఫోటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి. బెడ్ పై ఉన్న లాస్యకు వరుసగా సెలైన్ ఎక్కిస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ అసలు లాస్యకు ఏమైంది అన్న వియాన్ని ఆమె భర్త మంజునాథ్ వెల్లడించలేదు.

Anchor Lasya hospitalized fans worry what happened
Anchor Lasya

లాస్య హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉండగా ఒక వీడియో తీసిన ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో దాన్ని షేర్ చేస్తూ.. గెట్ వెల్ సూన్ అని రాసుకొచ్చాడు. దీంతో యాంకర్ లాస్యకు అసలు ఏం జరిగింది ? ఆమె ఎందుకు హాస్పిటల్లో జాయిన్ అయింది ? అంటూ ఆమె గురించి ఆమె అభిమానులు వాకబు చేస్తున్నారు. ఆమెకు జ్వరం వచ్చిందని, వైరల్ ఫీవర్ కావడంతోనే హాస్పిటల్లో జాయిన్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఆమె త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుతున్నారు. ఇంతకు లాస్యకు ఏమైంది అనేది ఆమె భర్త మంజునాథ్ స్పందిస్తే కానీ తెలీదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now