Anasuya : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప. ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మంచి కలెక్షన్స్ రాబడుతోంది. బన్నీ నటనతోపాటు సుకుమార్ నెరేషన్, ఇతర నటీనటుల యాక్టింగ్‌పై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు నీరాజనం పలుకుతున్నారు ఆడియన్స్. ఈ నేపథ్యంలో తిరుపతిలో మాసివ్ సక్సెస్ పార్టీ నిర్వహించింది.
ఈ వేడుకలో అనసూయ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ”బన్నీ.. మీరు నా లైఫ్‌లో ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు తెలియదు. మీ ఆర్మీ ఏదైతే ఉందో నన్ను బాగా తిట్టేశారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పడం ఒక పద్దతిలో చెప్పడం జరిగింది. కానీ అది వేరేలా వెళ్ళింది. కానీ అన్నీ అర్థం చేసుకునే పెద్ద హృదయం మీదని ప్రూవ్ చేశారు. ఇక `పుష్ప`లో తన రోల్ గురించి కంప్లెయింట్ ఉందట. తన పాత్రని చాలా తక్కువగా చూపించారని ఆమె బన్నీకి, సుకుమార్‌కి తెలిపింది.
రెండో పార్ట్ లో మరింతగా చూపిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పింది అనసూయ. మొదటి భాగంలో తమ్ముడి పాత్ర వదిలి వెళ్లిన బ్లేడ్‌తో రచ్చ చేయబోతున్నట్టు తెలిపింది అనసూయ. ఈ రోజు రంగమ్మత్త, దాక్షాయణి అని పిలుస్తున్నారంటే కారణం సుకుమార్ గారు. మీకు థ్యాంక్స్ చెప్పడం కూడా చాలా చిన్న పదం అని అంది అనసూయ. తాను ఐటమ్ సాంగ్ చేయాలనుకుంటున్నట్టు, అది కూడా అల్లు అర్జున్‌తో, దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్‌లో చేయాలనుకుంటున్నట్టు తన మనసులో మాటని బయటపెట్టింది హాట్ యాంకర్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…