Anasuya : మీ ఆర్మీ న‌న్ను తిట్టారంటూ బ‌న్నీకి కంప్లైంట్ చేసిన అన‌సూయ‌..!

December 22, 2021 8:12 PM

Anasuya : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెర‌కెక్కించిన చిత్రం పుష్ప‌. ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌డుతోంది. బన్నీ నటనతోపాటు సుకుమార్ నెరేషన్, ఇతర నటీనటుల యాక్టింగ్‌పై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు నీరాజనం పలుకుతున్నారు ఆడియన్స్. ఈ నేపథ్యంలో తిరుపతిలో మాసివ్ సక్సెస్ పార్టీ నిర్వహించింది.

Anasuya said that allu arjun fans are scolding her

ఈ వేడుక‌లో అన‌సూయ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి. ”బన్నీ.. మీరు నా లైఫ్‌లో ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు తెలియదు. మీ ఆర్మీ ఏదైతే ఉందో నన్ను బాగా తిట్టేశారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పడం ఒక పద్దతిలో చెప్పడం జరిగింది. కానీ అది వేరేలా వెళ్ళింది. కానీ అన్నీ అర్థం చేసుకునే పెద్ద హృదయం మీదని ప్రూవ్ చేశారు. ఇక `పుష్ప`లో తన రోల్‌ గురించి కంప్లెయింట్‌ ఉందట. తన పాత్రని చాలా తక్కువగా చూపించారని ఆమె బన్నీకి, సుకుమార్‌కి తెలిపింది.

రెండో పార్ట్ లో మరింతగా చూపిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పింది అనసూయ. మొదటి భాగంలో తమ్ముడి పాత్ర వదిలి వెళ్లిన బ్లేడ్‌తో రచ్చ చేయబోతున్నట్టు తెలిపింది అనసూయ. ఈ రోజు రంగమ్మత్త, దాక్షాయణి అని పిలుస్తున్నారంటే కారణం సుకుమార్ గారు. మీకు థ్యాంక్స్ చెప్పడం కూడా చాలా చిన్న పదం అని అంది అనసూయ. తాను ఐటమ్‌ సాంగ్‌ చేయాలనుకుంటున్నట్టు, అది కూడా అల్లు అర్జున్‌తో, దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌లో చేయాలనుకుంటున్నట్టు తన మనసులో మాటని బయటపెట్టింది హాట్‌ యాంకర్‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now