Sunny : బిగ్ బాస్ సీజన్ 5 విజేత సన్నీ ఇప్పుడు అందరి నోళ్లల్లో తెగ నానుతున్నాడు. అతని గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 1989లో ఖమ్మంలో పుట్టిన సన్నీ అసలు పేరు అరుణ్ రెడ్డి. సన్నీ తల్లి కళావతి స్టాఫ్ నర్సుగా పనిచేస్తుండేవారు. సన్నీకి ఇద్దరు అన్నయ్యలు ఉజ్వల్, స్పందన్. ఇక సన్నీ స్కూలింగ్ మొత్తం ఖమ్మంలోనే పూర్తిచేశాడు.
చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్నాడు సన్నీ. అతను వేసిన అల్లాదీన్ నాటకానికి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత జస్ట్ ఫర్ మెన్ అనే టీవీ షోతో యాంకర్‌గా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో రిపోర్టర్‌గా పనిచేశాడు. తన కెరీర్లో పలువురు సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాడు సన్నీ. బిగ్ బాస్ సీజన్ 5లోకి అడుగుపెట్టిన సన్నీ తనదైన శైలిలో గేమ్ ఆడుతూ అందరి మనసులను గెలుచుకున్నాడు.
గతంలో ఎప్పుడు కూడా సన్నీ కుల ప్రస్తావన బయటకు తీయని కొందరు కుల పిచ్చోళ్లు ఇప్పుడు గూగుల్‌లో అతని కులం కోసం తెగ వెతుకులాడేస్తున్నారు. మా అరుణ్ రెడ్డి గెలిచాడు. చూశార్రా మా అరుణ్ రెడ్డి బిగ్ బాస్ టైటిల్ కొట్టాడంటూ.. అతని ఫ్యాన్ పేజ్‌లోనే కొంతమంది కులపిచ్చోళ్లు పోస్ట్‌లు పెడుతున్నారు. నిజానికి సన్నీ అసలు పేరు అరుణ్ రెడ్డి అని చాలామందికి తెలియదు. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఎక్కడా కూడా అతను తన కుల ప్రస్తావన తీసుకురాలేదు. కానీ కొందరు కుల పిచ్చోళ్లు నానా రచ్చ చేస్తున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…