Anasuya : బుల్లితెరపై యాంకర్‌గా పరిచయమై.. ఇప్పుడు వెండితెరపై ఆర్టిస్ట్‌గా మారిన అనసూయ భరద్వాజ్ గురించి తెలిసిందే. సినిమాల్లో ఏ క్యారెక్టర్ అయినా ఓకే అంటుంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అనసూయ తన ప్రతి ఫీలింగ్‌ని, మూమెంట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్ల కామెంట్లను, కాంట్రవర్సీ పోస్ట్‌లను చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల ఆంటీ అంటూ తనను ట్రోలింగ్ చేసిన నెటిజన్లకు యాంకర్ అనసూయ తనదైన శైలిలో కౌంటర్ ఇస్తుంది. అంతేకాకుండా వాళ్ల మీద పోలీస్ కంప్లైంట్స్ కూడా ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది.
అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడు గ్లామర్ ఫొటోలతో ఎంటర్ టైన్ చేస్తూ ఉంటుంది. కానీ కొద్దిరోజులుగా డ్యాన్స్ వీడియోలతో దర్శనమిస్తూ రచ్చ చేస్తుంది. మహేశ్ బాబు ఒక్కడు మూవీలోని నువ్ ఏ మాయ చేశావో గానీ అనే పాటకు స్టెప్పులేసింది ఆకట్టుకుంది. అయితే తాజాగా అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియోని షేర్ చేసుకుంది. ఆ వీడియోలో ఆమె తన బెడ్ రూమ్ లో బెడ్ పై పడుకొని తన పక్కన భర్త లేని విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. నాకు నేనే గుడ్ నైట్ చెప్పుకుంటున్నాను అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది.
బెడ్ పై పడుకున్నా అనసూయ పక్కన ఖాళీగా ఉన్న భరద్వాజ్ ప్లేస్ ని చూపిస్తూ.. ఆ వీడియోకి కామెంట్ చేస్తూ.. ఇంట్లో ఆయన లేకపోతే గుడ్ నైట్ నాకు నేనే చెప్పుకోవాలి. ఒంటరిగా నిద్రపోవాల్సి వస్తుంది అంటూ రాసుకొచ్చింది. దీంతో అనసూయ ఫ్యాన్స్ సైతం మండి పడుతున్నారు. ప్రైవేట్ వీడియోని పబ్లిక్ గా పోస్ట్ చేయడం అవసరమా అనసూయ అని కొందరంటుంటే.. మరికొందరేమో ఏంటీ పిచ్చి పనులు అనసూయ.. నువ్వు ఇలాంటి విషయాలు షేర్ చేయకు సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వకు అంటూ హితబోధ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు అనసూయ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఆమెను ఓ రేంజ్ లో ఆడేసుకుంటుంటే.. ఇవన్నీ అనసూయకు మాములేలే అని కొందరు లైట్ తీసుకుంటున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…