Moto G72 : 108 మెగాపిక్స‌ల్ కెమెరాతో.. మోటో జి72 స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?

Moto G72 : మోటోరోలా కంపెనీ మ‌రో నూత‌న స్మార్ట్ ఫోన్‌తో మార్కెట్‌లోకి వ‌చ్చింది. ఇప్ప‌టికే ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు క‌లిగిన ఫోన్ల‌ను త‌యారు చేసి రిలీజ్ చేసిన మోటోరోలా మ‌రో స‌రికొత్త స్మార్ట్ ఫోన్‌ను వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తెచ్చింది. మోటో జి72 పేరిట విడుద‌లైన లేటెస్ట్ మోటోరోలా ఫోన్‌లో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు ల‌భిస్తున్నాయి. ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. మిడ్‌రేంజ్ మార్కెట్ ల‌క్ష్యంగా ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఇక ఇందులో అందిస్తున్న ఫీచ‌ర్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

మోటో జి72 స్మార్ట్ ఫోన్‌లో 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్ ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అలాగే దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్ కూడా ల‌భిస్తుంది. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి99 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేయ‌గా.. 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ ల‌భిస్తున్నాయి. దీంట్లో హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్ స్లాట్ ల‌భిస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌ను ఇస్తున్నారు.

Moto G72

ఈ ఫోన్‌లో వెనుక వైపు 108 మెగాపిక్స‌ల్ భారీ కెమెరా ఉండ‌గా.. దీనికి తోడు అద‌నంగా మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంది. అలాగే మ‌రో 2 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరాను ఇచ్చారు. ముందు వైపు 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తున్నారు. డాల్బీ అట్మోస్‌, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.1, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. ఇందులో ట‌ర్బో చార్జింగ్ ఫీచ‌ర్ కూడా ఉంది. దీని వ‌ల్ల ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుంది.

ఇక మోటోరోలా మోటో జి72 స్మార్ట్ ఫోన్ మీటియోరైట్ బ్లాక్‌, పోలార్ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో లాంచ్ కాగా.. దీని ధ‌ర రూ.18,999గా ఉంది. ఈ నెల 12వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను విక్ర‌యిస్తారు. లాంచింగ్ సంద‌ర్భంగా ఈ ఫోన్‌పై ప‌లు ఎంపిక చేసిన బ్యాంకుల‌కు చెందిన కార్డుల‌తో రూ.1000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ల‌భిస్తుంది. ఏదైనా ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే అద‌నంగా రూ.3000 ఎక్స్ఛేంజ్ బోన‌స్ ఇస్తారు. జియో, మింత్రా, జీ5 నుంచి రూ.5049 విలువైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM