Allu Arjun : ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరే వినిపిస్తోంది. ఎందుకంటే.. ఆయన నటించిన పుష్ప ది రైజ్ చిత్రం మామూలు హిట్ కాలేదు. ఇందులో అల్లు అర్జున్ స్టైల్‌కు సినీ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ప్రతి ఒక్కరూ పుష్ప స్టైల్‌ను అనుకరిస్తూ తమ సరదా తీర్చుకుంటున్నారు. విదేశీయులు సైతం పుష్ప స్టైల్‌కు ఆకర్షితులయ్యారు. పుష్ప ఫీవర్ ప్రస్తుతం మామూలుగా లేదు.
అయితే పుష్ప రెండో భాగమైన పుష్ప ది రూల్ షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే రెండో పార్ట్‌ను మొదటి పార్ట్ కన్నా మరింత భిన్నంగా సుకుమార్ తెరకెక్కించనున్నారు. దీంతో రెండో పార్ట్ పై మరింత ఆసక్తి పెరిగింది. అందులో అల్లు అర్జున్ మరింతగా అలరిస్తారని తెలుస్తోంది.
అయితే పుష్ప రెండో పార్ట్ మూవీ ప్రారంభం అయితే ఇక వెకేషన్‌కు వెళ్లేంత సమయం ఉండదు. అందుకని అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌కు వెళ్లారు. అక్కడ ఔరా స్కై పూల్‌లో ఆయన కుటుంబంతో గడిపారు. అక్కడి నుంచి దుబాయ్ స్కై లైన్ వ్యూను వీక్షించారు. అది ఎంతో అద్భుతంగా ఉండడం విశేషం.
దుబాయ్‌లో స్కై లైన్ వ్యూకు సంబంధించిన ఫొటోను అల్లు అర్జున్ షేర్ చేశారు. బిల్డింగ్ అంచున నిలబడి దుబాయ్ అందాలను చూస్తుంటే వర్ణించనలవి కాకుండా ఉంది. ఇక దుబాయ్‌లో వెకేషన్ ముగిసిన వెంటనే అల్లు అర్జున్ హైదరాబాద్‌కు ప్రయాణమై ఇక్కడకు రాగానే పుష్ప రెండో పార్ట్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…