Sukumar : ద‌ర్శ‌కుడు సుకుమార్ పై బ‌న్నీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్ర‌హం, అసంతృప్తి..!

June 15, 2022 9:23 AM

Sukumar : అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్న హీరో హీరోయిన్లుగా వ‌చ్చిన పుష్ప చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలిసిందే. హిందీ మార్కెట్‌లోనూ పుష్ప ప్ర‌భంజ‌నం సృష్టించింది. ఈ క్ర‌మంలోనే పుష్ప మూవీ వ‌చ్చి చాలా రోజులు అవుతున్నా.. ఈ మూవీ ట్రెండ్ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఈ మూవీలోని డైలాగ్‌ల‌ను చెబుతూ.. పాట‌ల‌కు డ్యాన్స్ లు చేస్తూ ప్రేక్ష‌కులు మైమ‌రిచిపోతున్నారు. సెల‌బ్రిటీలు సైతం పుష్ప డైలాగ్స్‌, పాట‌ల‌కు ఫిదా అవుతున్నారు. అయితే పుష్ప 2వ పార్ట్ షూటింగ్ ఇప్ప‌టికే ప్రారంభం కావ‌ల్సి ఉన్నా.. ఇంకా అది జ‌ర‌గ‌లేదు. దీంతో ఈ ఏడాది ఈ మూవీ విడుద‌ల లేన‌ట్లే అని చెప్ప‌వ‌చ్చు. అయితే ద‌ర్శ‌కుడు సుకుమార్‌పై మాత్రం బ‌న్నీ ఫ్యాన్స్ తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ అసంతృప్తితో ఉన్నారు.

ద‌ర్శ‌కుడు సుకుమార్ గ‌తంలో ఇత‌ర సినిమాల‌కు చెందిన ఈవెంట్ల‌కు పెద్ద‌గా హాజ‌రు కాలేదు. కానీ ఈ మ‌ధ్య త‌ర‌చూ ఇత‌ర హీరోల‌కు చెందిన ఈవెంట్ల‌లో పాల్గొంటున్నారు. స‌ర్కారు వారి పాట‌, విరాట ప‌ర్వం ఇలా పిలిచిన ప్ర‌తి ఈవెంట్‌కు వెళ్తున్నారు. దీంతో బ‌న్నీ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. పుష్ప 2 షూటింగ్ ఈపాటికే ప్రారంభం కావ‌ల్సి ఉన్నా.. ఇంకా ఎందుకు ప్రారంభించ‌లేద‌ని.. ద‌ర్శ‌కుడు సుకుమార్ ఈ మూవీని లైట్ తీసుకుంటున్నాడ‌ని.. త్వ‌ర‌గా ప‌నులు పూర్తి చేసి షూటింగ్ ప్రారంభించాల‌ని.. ఇంత నిర్ల‌క్ష్యం ప‌నికిరాద‌ని అంటున్నారు. అయితే సుకుమార్ మాత్రం త‌న ప‌నితాను చేసుకుపోతున్నారు.

Allu Arjun fans unhappe with Sukumar work
Sukumar

ఇక పుష్ప 2 ఆల‌స్యం అవుతుండ‌డానికి సుకుమార్ కార‌ణం కాద‌ని.. అల్లు అర్జున్ రెమ్యున‌రేష‌నేన‌ని తెలుస్తోంది. ఎందుకంటే మొద‌టి పార్ట్‌కు బ‌న్నీ రూ.45 కోట్లు తీసుకున్నాడ‌ట‌. కానీ రెండో పార్ట్‌కు రెమ్యున‌రేష‌న్‌గా హిందీ హ‌క్కుల‌ను అడుగుతున్నార‌ట‌. అందువ‌ల్లే సినిమా నిర్మాత‌లు బ‌న్నీతో చ‌ర్చిస్తున్నార‌ట‌. క‌నుక‌నే పుష్ప 2 ఆల‌స్యం అవుతుంద‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ త‌రువాత దీనిపై ఎలాంటి అప్‌డేట్ లేదు. ఏది ఏమైనా.. పుష్ప 2 మూవీ మాత్రం ఈ ఏడాదిలో విడుద‌ల కాద‌ని సుల‌భంగా చెప్ప‌వ‌చ్చు. ఇప్ప‌టిక‌ప్పుడు షూటింగ్ మొద‌లు పెట్టినా క‌నీసం ఏడాది ప‌డుతుంది. అంటే.. వ‌చ్చే ఏడాది వేస‌విలోనే పుష్ప 2 వ‌స్తుంద‌ని భావించ‌వ‌చ్చు. మ‌రి అప్ప‌టి వ‌ర‌కు అయినా మూవీ రిలీజ్ అవుతుందా.. లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment