Allu Aravind : మొన్నటి వరకు మెగా ఫ్యామిలీ అంటే అందులో అల్లు ఫ్యామిలీ కూడా ఉండేది. కానీ ఈ మధ్య కొన్ని పరిస్థితులను చూస్తుంటే అల్లు, మెగా ఫ్యామిలీ వేరు అనేలా అనిపిస్తోంది. మెగా వేడుకలకి అల్లు ఫ్యామిలీ దూరంగా ఉండడమే ఈ అనుమానాలను రేకెత్తించింది. మరోవైపు అల్లు అరవింద్.. చిరంజీవి ప్రత్యర్ధులతో చాలా స్నేహంగా మెలుగుతుండడం అభిమానులలో కొత్త అనుమానాలు పుట్టిస్తోంది.
ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ ప్రకాశ్ రాజ్‌ని సపోర్ట్ చేసింది. మంచు విష్ణుని బాలకృష్ణ, కృష్ణ, నరేష్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీలో మెగా వర్సెస్ మంచు ఫ్యామిలీ అన్న చందాన మారగా, అల్లు అరవింద్.. బాలయ్య, మోహన్ బాబుతో కలిసి షో ప్లాన్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అల్లు అరవింద్ తన ఆహా ప్లాట్ పామ్‌లోకి బాలయ్యని తీసుకు వచ్చారు. బాలయ్య హోస్ట్‌గా ఈ షో రూపొందనుంది.
బాలయ్య తొలి ఎపిసోడ్‌కి మంచు మోహన్ బాబు గెస్ట్‌గా రాబోతున్నారు. మోహన్ బాబు వర్సెస్ మెగా ఫ్యామిలీ మధ్య తీవ్రమైన వార్ నడుస్తున్న నేపథ్యంలో అల్లు అరవింద్ చేస్తున్న ఈ ప్లాన్స్ అభిమానులలో సరికొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. మంచు విష్ణు ప్రమాణ స్వీకారానికి చిరంజీవితోపాటు ఆయన సోదరులకు ఆహ్వానం అందలేదని కూడా మెగా అభిమానులు మండి పోతున్నారు. ఈ సందర్భంలో అల్లు అరవింద్ వ్యవహారం అనేక అనుమానాలకు తావిస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…