గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Allu Aravind : నంద‌మూరి ఫ్యామిలీకి ద‌గ్గ‌ర‌గా అల్లు అర‌వింద్.. మెగా ఫ్యామిలీకి దూర‌మైన‌ట్టేనా?

Allu Aravind : మొన్న‌టి వ‌ర‌కు మెగా ఫ్యామిలీ అంటే అందులో అల్లు ఫ్యామిలీ కూడా ఉండేది. కానీ ఈ మధ్య కొన్ని ప‌రిస్థితులను చూస్తుంటే అల్లు, మెగా ఫ్యామిలీ వేరు అనేలా అనిపిస్తోంది. మెగా వేడుక‌ల‌కి అల్లు…

Allu Aravind : నంద‌మూరి ఫ్యామిలీకి ద‌గ్గ‌ర‌గా అల్లు అర‌వింద్.. మెగా ఫ్యామిలీకి దూర‌మైన‌ట్టేనా?

Allu Aravind : మొన్న‌టి వ‌ర‌కు మెగా ఫ్యామిలీ అంటే అందులో అల్లు ఫ్యామిలీ కూడా ఉండేది. కానీ ఈ మధ్య కొన్ని ప‌రిస్థితులను చూస్తుంటే అల్లు, మెగా ఫ్యామిలీ వేరు అనేలా అనిపిస్తోంది. మెగా వేడుక‌ల‌కి అల్లు ఫ్యామిలీ దూరంగా ఉండ‌డ‌మే ఈ అనుమానాలను రేకెత్తించింది. మ‌రోవైపు అల్లు అర‌వింద్.. చిరంజీవి ప్ర‌త్య‌ర్ధుల‌తో చాలా స్నేహంగా మెలుగుతుండ‌డం అభిమానుల‌లో కొత్త అనుమానాలు పుట్టిస్తోంది.

Allu Aravind coming close to nandamuri family distance with mega family

ఇటీవ‌ల జరిగిన మా ఎన్నిక‌ల్లో మెగా ఫ్యామిలీ ప్ర‌కాశ్ రాజ్‌ని స‌పోర్ట్ చేసింది. మంచు విష్ణుని బాల‌కృష్ణ‌, కృష్ణ, న‌రేష్  స‌పోర్ట్ చేశారు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో మెగా వ‌ర్సెస్ మంచు ఫ్యామిలీ అన్న చందాన మార‌గా, అల్లు అరవింద్.. బాల‌య్య, మోహ‌న్ బాబుతో క‌లిసి షో ప్లాన్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అల్లు అరవింద్ తన ఆహా ప్లాట్ పామ్‌లోకి బాల‌య్య‌ని తీసుకు వచ్చారు. బాల‌య్య హోస్ట్‌గా ఈ షో రూపొందనుంది.

బాల‌య్య తొలి ఎపిసోడ్‌కి మంచు మోహ‌న్ బాబు గెస్ట్‌గా రాబోతున్నారు. మోహన్ బాబు వర్సెస్ మెగా ఫ్యామిలీ మధ్య తీవ్రమైన వార్ నడుస్తున్న నేప‌థ్యంలో అల్లు అర‌వింద్ చేస్తున్న ఈ ప్లాన్స్ అభిమానుల‌లో స‌రికొత్త ఆలోచ‌న‌లు రేకెత్తిస్తున్నాయి. మంచు విష్ణు ప్రమాణ స్వీకారానికి చిరంజీవితోపాటు ఆయన సోదరులకు ఆహ్వానం అందలేదని కూడా మెగా అభిమానులు మండి పోతున్నారు. ఈ సంద‌ర్భంలో అల్లు అర‌వింద్ వ్య‌వ‌హారం అనేక అనుమానాలకు తావిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి