Akhanda Movie : బాల‌కృష్ణ అఖండ‌ సినిమాలో న‌టించిన ఈయ‌న గురించి తెలుసా..?

December 4, 2021 5:23 PM

Akhanda Movie : నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌నుల కాంబినేష‌న్ లో వ‌చ్చిన అఖండ మూవీ రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతూ బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతోంది. కోవిడ్ రెండో ద‌శ అనంత‌రం అనేక సినిమాలు వ‌చ్చినా వాటిల్లో కొన్నే హిట్ అయ్యాయి. అలా హిట్ అయిన మూవీల్లో అఖండ ఒకటి. దీంతో చాలా రోజుల త‌రువాత బాల‌య్య‌కు హిట్ ల‌భించ‌గా.. టాలీవుడ్ ఇప్పుడు గంపెడు ఆశ‌ల‌తో ఎదురు చూస్తోంది. ఇక త్వ‌ర‌లోనే పెద్ద సినిమాలు మ‌రిన్నింటిని ఉత్సాహంగా విడుద‌ల చేసేందుకు రెడీ అవుతున్నారు.

Akhanda Movie nithin mehta news trending in social media

అయితే అఖండ మూవీలో న‌టించిన నితిన్ మెహ‌తా ఇప్పుడు పాపుల‌ర్ అయ్యారు. ఆయ‌న గురించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ మూవీలో నితిన్ మెహ‌తా పాత్ర‌కు మంచి గుర్తింపు ల‌భించింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న బ్యాక్‌గ్రౌండ్ తెలిసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

నితిన్ మెహ‌తా నిజానికి ఇండియ‌న్ ఆర్మీలో 21 సంవ‌త్స‌రాలు పాటు ప‌నిచేశారు. అయితే ఆయ‌న న‌టుడిగా పేరు తెచ్చుకోవాల‌కున్నారు. అందుక‌నే మోడ‌ల్ అయ్యారు. సినిమాల్లో న‌టించ‌డం కోస‌మే ఆయ‌న ఆర్మీ జాబ్‌ను సైతం వ‌దులుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ విష‌యం తెలిసిన అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఇక అఖండ మూవీలో న‌టించిన నితిన్ మెహ‌తా ఒక్క‌సారిగా స్టార్ అయిపోయారు. ఆయ‌న అచ్చం త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌లా ఉన్నారంటూ అంద‌రూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే నెటిజ‌న్లు ప‌లు మీమ్స్ కూడా సృష్టిస్తున్నారు. ఈ మూవీలో నితిన్ మెహ‌తా న‌ట‌న‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. ఇక ఆయ‌న‌కు వ‌రుస‌గా అవ‌కాశాలు రావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌స్సు 48 ఏళ్లు కాగా సినిమాలలో మ‌రిన్ని చాన్స్‌ల కోసం ఆయ‌న ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment