Actress Rajani : శ్రీదేవి, జయప్రదల తర్వాత సహజ నటి ఎవరైనా ఉన్నారు అంటే అది నటి రజినీ మాత్రమే. సీతారామ కళ్యాణం, రెండు రెళ్ళ ఆరు, అహ నా పెళ్ళంట లలో రాజేంద్ర ప్రసాద్ సరసన, మజ్నులో నాగార్జున సరసన, సీతరాముల కళ్యాణంలో బాలకృష్ణ సరసన నటించింది. తెలుగులో నాగార్జున సరసన నటించిన మజ్ను సినిమాకి మంచి గుర్తింపు లభించింది. అలాగే రాజేంద్రప్రసాద్ తో అనేక సినిమాల్లో కలిసి నటించిన రజినీ 1985లో బ్రహ్మముడి అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఆ తర్వాత ఏకంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 150 కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇక ప్రస్తుతం రజినీ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. రజినీ అసలు పేరు శశికళ అలాగే పూర్తి పేరు రజినీ పర్వర్.
బెంగుళూరులో పుట్టిన రజిని 1998లో వివాహం చేసుకుంది. ఈమెకు ముగ్గురు పిల్లలు జన్మించాక ఆ వివాహ బంధం నుంచి బయటకు వచ్చి ఒంటరిగా జీవిస్తోంది. వాళ్ల పెళ్లి పెటాకులు కావడం పెద్ద వింత ఏమీ లేదు కానీ రజనీ జీవితంలో మాత్రం అనేక కష్టాలు ఉన్నాయట. ముల్లగిరి ప్రవీణ్ అనే ఒక ఎన్నారై డాక్టర్‌ను పెళ్లి చేసుకున్న రజినీ తాను సినిమాల్లో సంపాదించిన డబ్బును అంతా కూడా భర్త దగ్గరే పెట్టిందట. అలాగే ముంబైలో ఒక అపార్ట్మెంట్ కూడా కొనుగోలు చేసింది.
అయితే పెళ్లయ్యాక భర్త అలాగే అత్త డబ్బుల కోసం రజినీని బాగా ఇబ్బంది పెట్టారట. అదనపు కట్నం తేవాలని డిమాండ్ చేశారట. అంతేకాదు ఆమె కొనుక్కున్న అపార్ట్మెంట్ సైతం తన భర్త అతడి తల్లిపై రిజిస్ట్రేషన్ చేయించడంతో చేతిలో చిల్లి గవ్వ లేకుండా పోయిందట. అంతేకాదు తనపై తప్పుడు కేసులు పెట్టి వదిలించుకోవాలని చూస్తున్నారంటూ కూడా కోర్టులో పిటిషన్ వేసింది రజినీ. ఇప్పటికీ తనకు రావాల్సిన డబ్బుల కోసం.. అలాగే తన కష్టపడి సంపాదించిన డబ్బు కోసం కోర్టుల చుట్టూ తిరుగుతోంది రజినీ. చూడాలి రజనీకి ఎప్పుడు న్యాయం జరుగుతుందో..!
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…