Actress Hema : సురేఖావాణి కూతురు సుప్రీతపై నటి హేమ సంచలన వ్యాఖ్యలు..!

August 12, 2022 7:52 AM

Actress Hema : నటి హేమ అంటే అందరికీ సుపరిచితమే. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. హేమ బిగ్ బాస్ హౌస్‌లో కూడా సందడి చేసింది. కొన్ని రోజులకే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఈమె నటిగానే కాకుండా అప్పుడప్పుడూ వివాదాలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. తాజాగా హేమ మరో నటి సురేఖ వాణిని ఉద్దేశిస్తూ సంచలన ఆరోపణలు చేసింది.

సురేఖ కూతురు సుప్రీత.. తన కూతురు ఈషా మంచి ఫ్రెండ్స్ కాగా ఆమె వాళ్ళను విడగొట్టింద‌ని, తన గురించి వేరే వాళ్లకు తప్పుగా చెప్పేవారని ఆమె ఆరోపించింది. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేఖను ఉద్దేశిస్తూ హేమ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇంతకీ హేమ ఏమన్న‌దంటే.. సురేఖవాణి, నేను బెస్ట్ ఫ్రెండ్స్. మాలాగే మా అమ్మాయిలు కూడా మంచి స్నేహితులు. అయితే సురేఖ వాళ్ళను విడగొట్టాలని చూసింది. ఇద్దరూ ఒకే స్కూల్ లో చదువుతుండగా సుప్రీతను వేరే స్కూల్ లో చేర్చింది. అయినా సుప్రీత.. నా కూతురు ఈషా ఉన్న స్కూల్ కే తిరిగి వచ్చేసింది.

Actress Hema sensational comments on Supritha
Actress Hema

సుప్రీత కొంచెం బోల్డ్ గా ఉంటుంది. ఆ కారణంతోనే నా కూతురు ఈషాకు ఆమెను దూరం చేయాలని సురేఖ ప్రయత్నం చేసింది. అంతే కాకుండా షూటింగ్స్ సెట్స్ లో సురేఖ వేరే వాళ్ళకి నా గురించి తప్పుగా చెప్పింది. ఇవన్నీ తెలిశాక ఆమెను కలవడం మానేశాను. నేను సురేఖకు దూరంగా ఉంటున్నాను.. అని హేమ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సురేఖపై హేమ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరి హేమ ఆరోపణలకు సురేఖ వాణి ఎలా స్పందిస్తుందో చూడాలి. సురేఖా వాణి తెలుగు సినిమాల్లో తల్లి, కోడలు, భార్య పాత్రల్లో మెరుస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి. సురేఖ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించింది. మూడేళ్ళ క్రితం సురేఖ వాణి భర్త అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుండి ఆమె కూతురు సుప్రీతతో ఒంటరిగా ఉంటోంది. సురేఖ వాణి కూతురు సుప్రీతకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సుప్రీతను హీరోయిన్ ను చేయాలనేది ఆమె లక్ష్యంగా కనిపిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment