Actress Hema : ఇది కూడా కాంట్ర‌వ‌ర్సీ చేయాల‌నుకుంటున్నారా.. కోపంతో ఊగిపోయిన హేమ‌.. వీడియో..

October 4, 2022 10:15 PM

Actress Hema : నటి హేమ అంటే అందరికీ సుపరిచితమే. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. హేమ బిగ్ బాస్ హౌస్‌లో కూడా సందడి చేసింది. కొన్ని రోజులకే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఈమె నటిగానే కాకుండా అప్పుడప్పుడూ వివాదాలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. అయితే ఎవరైనా గుడికి ఎందుకు వెళ్తారు. ప్రశాంతత కోసం.. గుడిలో ఉన్న పాజిటివ్ వైబ్స్ కోసం వెళతాం.. కొంచెమైనా మనసు ప్రశాంతంగా ఉండడానికి.. మన తలపై ఉన్న భారం దించుకోవడానికి గుడికి వెళ్తాం..

అయితే తాజాగా హేమ బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంది. దర్శనం అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. అక్కడ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హేమ ఆగ్రహంతో ఊగిపోయింది. అమ్మవారి సన్నిధిలో ఆమె మాట్లాడుతూ.. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అమ్మవారిని చూడలేను ఏమో అనుకున్నాను. కానీ ఆ అమ్మవారే నన్ను తన దగ్గరికి రప్పించుకుంది అంటూ చెప్పుకొచ్చింది.

Actress Hema angry on media for questioning her temple ticket
Actress Hema

ఇదే టైం లో ఓ రిపోర్టర్ మీరు టికెట్స్ తీసుకున్నారా లేదా అని ప్రశ్నించగా.. ఒక్కసారిగా సీరియస్ అయిపోయింది హేమ. ఏంటీ.. గుడిలో కూడా కాంట్రవర్సీ చేయాలనుకుంటున్నారా.. అమ్మవారికి రూ.20 వేలు పెట్టి చీర తెచ్చాను. రూ.10 వేలు హుండీలో వేశాను. అయినా టికెట్ గురించి అడుగుతున్నారా మీరు.. నేను ప్రోటోకాల్ ప్రకారమే అన్ని ఫాలో అవుతున్నాను. నేను దుర్గమ్మ భక్తురాలిని. అమ్మవారి కోసమే ఇక్కడికి వచ్చాను కాంట్రవర్సీ కోసం కాదు అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now