గురువారం, జూన్ 11, 2026
వార్తలు

మ‌ద్యం సేవించి సురేఖా వాణి, ఆమె కుమార్తె ర‌చ్చ రచ్చ‌.. వీడియో వైర‌ల్‌..

బుల్లితెర యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన సురేఖవాణి ఆ తర్వాతి కాలంలో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి నటన పరంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. బొమ్మరిల్లు, సీమ టపాకాయ్, పవర్, సరైనోడు, నేల టిక్కెట్టు, రామారావు ఆన్…

మ‌ద్యం సేవించి సురేఖా వాణి, ఆమె కుమార్తె ర‌చ్చ రచ్చ‌.. వీడియో వైర‌ల్‌..

బుల్లితెర యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన సురేఖవాణి ఆ తర్వాతి కాలంలో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి నటన పరంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. బొమ్మరిల్లు, సీమ టపాకాయ్, పవర్, సరైనోడు, నేల టిక్కెట్టు, రామారావు ఆన్ డ్యూటీ వంటి అనేక చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. భర్త మరణం తర్వాత సోషల్ మీడియాలో తెగ హల్ చ‌ల్ చేస్తూ ఉంది సురేఖ వాణి.

సోషల్ మీడియాలో సురేఖ వాణికి ఫాలోయింగ్ కూడా చాలానే ఉంది. కూతురు సుప్రీతతో సురేఖ వాణి చేసే సందడి నెటిజన్ల‌ను సైతం ఎంతగానో ఆకర్షిస్తుంది. తల్లీకూతుళ్లు కలిసి చేసే డాన్స్ వీడియోలు కూడా నెటిజన్లను ఫిదా చేసేస్తాయి.  కొన్ని సందర్భాలలో వీరిద్దరి వస్త్రధారణ వివాదాస్పద వ్యాఖ్యలకు దారి తీస్తుంటుంది. ఈ క్రమంలోనే వీరిద్దరికీ సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

surekha vani celebrated supritha birth day in grand level

సురేఖ వాణి కూతురు సుప్రీతకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా సుప్రీత పుట్టిన రోజు వేడుకలను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. సుప్రీత వస్త్రధారణ చూస్తే అందరి మతులూ పోగొట్టే విధంగా ఉన్నాయి.  పుట్టినరోజు పార్టీలో సురేఖ వాణి కూతురుకు డ్రింక్ తాగించడం, కూతురుని ఎత్తుకొని మరీ కేక్ కట్ చేయడం అందర్నీ ఎంతగానో ఆకర్షించాయి. అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా సుప్రీతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్ర‌మంలోనే వారి ఫొటోలు, వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి.

 

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి