Surekha Vani : సురేఖా వాణి త్వరలో పెళ్లి చేసుకోనుందా..?

August 13, 2022 4:21 PM

Surekha Vani : టాలీవుడ్ లో గ్లామర్ గా ఉన్న అతి కొద్దిమంది క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లలో సురేఖ వాణి కూడా ఒక‌రు. హీరో హీరోయిన్ ల‌కు అక్క, వ‌దిన క్యారెక్ట‌ర్ లు చేస్తున్నా.. హీరోయిన్ ల‌కు ఏమాత్రం తీసిపోని అందం సురేఖ వాణిది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండ‌స్ట్రీలో బిజీ బిజీగా సురేఖావాణి ఎమోష‌న‌ల్ సీన్ లు, కామెడీ సీన్ల‌లో సైతం న‌టిస్తూ న‌టిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు కాస్త సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం ఫ్యాన్స్‌ తో టచ్‌ లోనే ఉంటోంది. ఆమె కుమార్తె సుప్రీతకు కూడా సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఇటీవలే సుప్రీత బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవ్వడం చూశాం.

తాజాగా యూట్యూబర్‌ నిఖిల్‌ విజయేంద్ర సింహా.. సురేఖా వాణి, సుప్రీతలను ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో వారికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలు వేశాడు. అందుకు వాళ్లు ఎంతో సరదాగా సమాధానాలు చెప్పారు. కొన్ని సీరియస్‌ ఇష్యూస్ కి కూడా నిఖిల్‌ తనదైన శైలిలో సమాధానాలు రాబట్టాడు. ఇప్పుడు నిఖిల్‌ సింహా అడిగిన ఓ ప్రశ్న నెట్టింట వైరల్‌ గా మారింది.

Surekha Vani reportedly will marry what is the truth
Surekha Vani

త్వరలో సురేఖా వాణి మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా ? అంటూ నిఖిల్‌ ప్రశ్నించాడు. అందుకు సురేఖా వాణి నో అనే బోర్డు చూపించగా.. సుప్రీత మాత్రం ఎస్‌ అనే బోర్డు చూపించింది. అంతేకాకుండా చేసేద్దాం సింగిల్‌ గా ఎలా ఉంటుంది. అలా ఉన్నప్పటి నుంచీ నా బుర్ర తింటోంది అంటూ కామెంట్‌ చేసింది. బాయ్ ఫ్రెండ్‌ విషయంలో నిఖిల్‌ మరో ప్రశ్న అడిగాడు.

మీరిద్దరూ సింగిలేనా ? అంటూ తల్లీ కుమార్తెలను ప్రశ్నించగా.. ఇద్దరూ అవునని చెప్పారు. ఎలాంటి బాయ్‌ ఫ్రెండ్‌ కావాలని కోరగా.. నన్ను భరిస్తే చాలంటూ సుప్రీత సమాధానం చెప్పింది. సురేఖ‌ మాత్రం తనకు కావాల్సిన బాయ్ ఫ్రెండ్‌ క్వాలిటీస్‌ రివీల్‌ చేసింది. 6 ఫీట్‌ హైట్‌ ఉండాలి, మంచి కలర్‌, బాగా డబ్బు ఉండాలి, బాగా చూసుకోవాలి, లైట్‌ గా గడ్డం ఉండాలి.. అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్ర‌మంలోనే వీరి కామెంట్స్ సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now