Actress Hema : వాళ్ల‌ను చెప్పుతో కొడ‌తా అని వార్నింగ్ ఇచ్చిన న‌టి హేమ‌..!

April 3, 2022 9:30 PM

Actress Hema : ఆదివారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో బంజారా హిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు జరిపిన విష‌యం తెలిసిందే. ముంద‌స్తు స‌మాచారం మేర‌కు ఈ పార్టీలో విచ్చలవిడిగా డ్రగ్స్ వాడుతున్నారని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. ఒక్కసారిగా పబ్‌ని చుట్టుముట్టి దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో మెగా డాటర్ నిహారిక, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సింప్లిగంజ్ కూడా ఉండటంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఈ వ్యవహారంలో ఇంకొంతమంది సెలబ్రిటీలు చిక్కున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. గ‌ల్లా అశోక్, న‌టి హేమ పేర్లు కూడా బ‌య‌ట‌కు రాగా, వారు ఖండించారు.

Actress Hema given warning to them
Actress Hema

పుడింగ్ అండ్ మింక్ పబ్బులో టాలీవుడ్ నటి హేమ కూడా ఉన్నట్లు ఓ మీడియాలో ఆమె పేరు వచ్చింది. దీనితో ఆమె కుటుంబ సభ్యులు కంగారు కంగారు పడ్డారు. దీంతో హేమ సదరు టీవీ ఛానల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేను పబ్‌లో లేకపోయినా.. నా పేరు ఎందుకు బయటకు తెచ్చారంటూ సూటిగా నిలదీశారామె. పబ్‌లో దొరికినవారిలో తమ కుటుంబసభ్యులు ఎవరూ లేరంటూ గల్లా కుటుంబం ప్రెస్‌నోట్‌ విడుదల చేసింది. తనను రాజకీయంగా ఎదుర్కోలేక.. తన కుమారుడిని ఈ కేసులో ఇరికిస్తున్నారంటూ సికింద్రాబాద్‌ మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

హేమ మాట్లాడుతూ.. తనకు ఎలాంటి సంబంధం లేకున్నా తనని బదనాం చేస్తున్నారు అంటూ వాపోయింది. ఆ ఛానల్ వాడిని వదలను.. నేను మహిళని, నాకు ఒక ఆడబిడ్డ ఉంది.. ఆ ఛానల్ వాడిని వదిలేది లేదు అంటూ హేమ మీడియా ముందు విరుచుకుపడింది. రాత్రి తాను తన ఇంట్లోనే ఉన్నట్లు హేమ మీడియాకు క్లారిటీ ఇచ్చింది. తనకు సంబంధం లేనప్పటికీ మీడియాలో పేరు వేసి ఇబ్బంది పెట్టడం ఏంటి అని హేమ సదరు టీవీ ఛానల్ రిపోర్టర్ తో వాగ్వాదానికి దిగింది.

అనవసరంగా నా పేరుని లాగారు. దీంతో నా తమ్ముడు, నా కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ ఫోన్ చేశారు. డ్రగ్స్ మాఫియా అనేది చాలా పెద్దది. దానిపై అందరూ పోరాటం చేయాలి. సినిమా వాళ్లందరూ ఓ ల‌క్ష మంది ఉంటారు. ఇప్పుడు దొరికిన 150 మందిలో ఎంత మంది సినిమా వాళ్లు ఉన్నారో చెప్పండి. సినిమా వాళ్లు అంటూ అందరినీ బ‌ద‌నాం చేయ‌కండి. పార్టీకి వెళ్లిన వారంద‌రూ డ్ర‌గ్స్ తీసుకున్నార‌ని కాదు క‌దా. ఒక‌రిద్ద‌రి వ‌ల్ల అంద‌రికీ స‌మ‌స్య వ‌చ్చింది. ఈ డ్ర‌గ్స్ పిల్ల‌ల జీవితాన్ని నాశ‌నం చేస్తుంది. తెలంగాణ ప్ర‌భుత్వం దీనిపై గ‌ట్టి చ‌ర్య‌లైతే తీసుకుంటుంద‌ని భావిస్తున్నాను అని హేమ పేర్కొంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment