Balakrishna : ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చిత్రాల హంగామా ముగిసింది. ఇక ఇప్పుడు ఆచార్య సందడి మొదలైంది. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు ఉండడంతో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. ఆచార్య చిత్రం సినీ ప్రేమికులకు విజువల్ ట్రీట్‌గా ఉంటుంది. మాస్ కథకు భారీగా కమర్షియల్ హంగులు అద్దాం.. అని కొరటాల శివ అంటున్నారు. వెండితెరపై చిరు, చరణ్‌ను కలిపి చూడటం అభిమానులకు పండుగలా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ పాత్ర 30 నిమిషాల పాటు ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డె హీరోయిన్ గా నటించింది.
ఏప్రిల్29న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పాటలు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లతో సినిమాపై అంచనాలు రెట్టింపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. అయితే ఆచార్య సినిమా కథ తనదే అంటూ రచయిత రాజేష్ మండూరి సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆచార్య కథను తాను తన గ్రామంలోని రామాలయంలో జరిగిన ఓ ఘటన ఆదారంగా రాసుకున్నానని.. బాలయ్య హీరోగా ఈ సినిమా చేయాలని తాను భావించినట్టు చెప్పుకొచ్చారు.
మైత్రి మూవీ మేకర్స్‌కి సంబంధించిన చెర్రీ అనే వ్యక్తికి ఈ కథ వినిపించగా, అతడు కథ వినే సమయంలో రికార్డింగ్ చేశాడని చెప్పాడు. అంతే కాకుండా ఈ కథను కొరటాల శివ తెరకెక్కిస్తే బాగుంటుందని అన్నట్టు తెలిపారు. వారు కథ విని సైలెంట్ గా వెళ్లారని తనకు ఎలాంటి రిప్లై ఇవ్వకపోవడంతో నచ్చలేదని అనుకున్నట్టు తెలిపారు. అయితే కొరటాల శివ అదే కథతో సినిమా చేస్తుండడం నాకు షాక్ ఇచ్చింది. ఆ కథ తనదే అని ఈ విషయంపై అసోసియేషన్ లో ఫిర్యాదు చేశానని చెప్పారు. తాను కొరటాలకు కథ పంపానని ఆయన ఆచార్య కథ వేరని చెప్పారని అన్నారు. మొత్తానికి ఈ ట్విస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…