Balakrishna : ఆచార్య మూవీని బాల‌కృష్ణ చేయాల్సి ఉందా ? కానీ చిరంజీవి చేస్తున్నారా ? మ‌ధ్య‌లో ఇదేం ట్విస్ట్ ?

April 21, 2022 8:05 AM

Balakrishna : ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చిత్రాల హంగామా ముగిసింది. ఇక ఇప్పుడు ఆచార్య సంద‌డి మొద‌లైంది. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ వంటి ఇద్ద‌రు స్టార్ హీరోలు ఉండ‌డంతో ఈ మూవీపై ఆస‌క్తి నెల‌కొంది. ఆచార్య చిత్రం సినీ ప్రేమికులకు విజువల్ ట్రీట్‌గా ఉంటుంది. మాస్ కథకు భారీగా కమర్షియల్ హంగులు అద్దాం.. అని కొర‌టాల శివ అంటున్నారు. వెండితెరపై చిరు, చరణ్‌ను కలిపి చూడటం అభిమానులకు పండుగలా ఉంటుందని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఆచార్య చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ పాత్ర 30 నిమిషాల పాటు ఉండ‌బోతుంద‌ని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా పూజా హెగ్డె హీరోయిన్ గా న‌టించింది.

Acharya movie prepared for Balakrishna not Chiranjeevi what is this
Balakrishna

ఏప్రిల్‌29న విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించి ప్ర‌స్తుతం జోరుగా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయి. పాట‌లు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌ల‌తో సినిమాపై అంచ‌నాలు రెట్టింపు చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అలాగే ఇంట‌ర్వ్యూలు కూడా ఇస్తున్నారు. అయితే ఆచార్య సినిమా క‌థ త‌న‌దే అంటూ ర‌చ‌యిత రాజేష్ మండూరి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఆచార్య క‌థ‌ను తాను త‌న గ్రామంలోని రామాల‌యంలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న ఆదారంగా రాసుకున్నాన‌ని.. బాల‌య్య హీరోగా ఈ సినిమా చేయాల‌ని తాను భావించిన‌ట్టు చెప్పుకొచ్చారు.

మైత్రి మూవీ మేక‌ర్స్‌కి సంబంధించిన చెర్రీ అనే వ్య‌క్తికి ఈ క‌థ వినిపించ‌గా, అత‌డు క‌థ వినే స‌మ‌యంలో రికార్డింగ్ చేశాడ‌ని చెప్పాడు. అంతే కాకుండా ఈ క‌థ‌ను కొర‌టాల శివ తెర‌కెక్కిస్తే బాగుంటుంద‌ని అన్న‌ట్టు తెలిపారు. వారు క‌థ విని సైలెంట్ గా వెళ్లారని త‌న‌కు ఎలాంటి రిప్లై ఇవ్వ‌క‌పోవ‌డంతో న‌చ్చ‌లేద‌ని అనుకున్న‌ట్టు తెలిపారు. అయితే కొర‌టాల శివ అదే క‌థ‌తో సినిమా చేస్తుండ‌డం నాకు షాక్ ఇచ్చింది. ఆ క‌థ త‌న‌దే అని ఈ విష‌యంపై అసోసియేష‌న్ లో ఫిర్యాదు చేశాన‌ని చెప్పారు. తాను కొర‌టాల‌కు క‌థ పంపాన‌ని ఆయ‌న ఆచార్య క‌థ వేర‌ని చెప్పార‌ని అన్నారు. మొత్తానికి ఈ ట్విస్ట్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now