Acharya : చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య చిత్రం ప్రేక్షకులని ఏ మాత్రం అలరించలేకపోయింది. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉండగా, ఆచార్య రిలీజ్ తర్వాత ఇటు ఫ్యాన్స్‌ని, అటు ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించలేకపోయింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తొలి ఆట నుంచే ఆశించిన టాక్‌ను రాబట్టుకోలేకపోయింది. తొలి రోజు వచ్చిన కలెక్షన్స్‌కు, మూడో రోజు కలెక్షన్స్‌కు సంబంధమే కనిపించటం లేదు. హాలీడే సమయంలోనూ ఈ సినిమా పెద్దగా వసూళ్లను రాబట్టకపోవడం విశేషం.
అయితే ఆచార్య ఇంత దారుణంగా విఫలం అవ్వడం చూసి మిగతా హీరోలు పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే మంచు ఫ్యామిలీ ఖుష్ అవుతుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అక్కినేని హీరోలు కూడా ఫుల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారట. మెగా హీరోల ప్రాజెక్ట్‌లతో పోలిస్తే అక్కినేని హీరోల సినిమాలకు తక్కువ కలెక్షన్లు వచ్చేవి. దీంతో అక్కినేని అభిమానులు చాలా నిరుత్సాహపడేవారు. కానీ ఆచార్య విషయంలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించినా కూడా బంగార్రాజు సినిమా అంత హిట్ కాలేకపోయింది. ఈ క్రమంలోనే ఆచార్యకు తక్కువ కలెక్షన్లు వచ్చాయి. బంగార్రాజు అన్ని కలెక్షన్లు కూడా రాకపోయే సరికి ఈ సారికి అక్కినేని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. ఎట్టకేలకు తమ హీరోలకు మెగా హీరోల సినిమాల కన్నా ఎక్కువ కలెక్షన్లు వచ్చాయని వారు సంబరపడుతున్నారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్‌కు, మెగా ఫ్యాన్స్‌కు మధ్య సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్ల వార్ నడుస్తోంది.
ఇక బంగార్రాజులో ఉన్న కాంబో సీన్లు కూడా ఆచార్యలో లేవని అంటున్నారు. అది వాస్తవమే. ఫ్యామిలీ మెంబర్స్ కలిసి తీసిన సినిమాల్లో ఇప్పటి వరకు అక్కినేని వారివే హిట్ అయ్యాయి. మనం, బంగార్రాజు వంటి చిత్రాల్లో అక్కినేని హీరోల సీన్లు బాగా పండాయి. కానీ ఆచార్యలో చిరు, చరణ్‌లు పూర్తి స్థాయి పాత్రల్లో నటించినా.. వారి మధ్య అక్కినేని హీరోల అంతటి కాంబో సీన్లు రాలేదని అంటున్నారు. ఇది ఆచార్యకు మైనస్ అయిందని అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు.
ఇక ఇండస్ట్రీతోపాటు అభిమానుల మధ్య జరిగే కొన్ని వార్స్ ఆసక్తికరంగా మారుతుంటాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం అలాంటి యుద్ధమే అక్కినేని, మెగా ఫ్యాన్స్ మధ్య నడుస్తోంది. ఇక ఈ సినిమా ఎడిటింగ్‌లో చాలా మందిని లేపేశారని టాక్. ఆచార్యలో కాజల్ మాత్రమే కాదు. కాజల్ కాంబినేషన్ లో ఉన్న దాదాపు నలుగురైదుగురు నటుల సీన్స్ ను ఎడిటింగ్ లో లేపేశారు కొరటాల. లాహె లాహె పాటలో కాజల్ సంగీత తో కలిసి వేసే స్టెప్పులలో అక్కడక్కడా కమెడియన్ సత్య, జబర్దస్త్ శీను, చంద్ర లాంటి వాళ్లు కనిపించేవారు. ఎప్పుడయితే కాజల్ సీన్స్ కట్ చేయాలనుకున్నారో, టోటల్ కాంబో సీన్స్ లో ఉన్న ఆర్టిస్ట్ లని లేపేయడం సినిమాకి మైనస్‌గా మారిందనే చెప్పాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…