Acharya : ఆచార్య ఫ్లాప్‌తో.. సంబురాలు జ‌రుపుకుంటున్న‌ అక్కినేని ఫ్యాన్స్.. ఎందుకంటే..?

May 2, 2022 8:20 PM

Acharya : చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో కొర‌టాల శివ తెరకెక్కించిన ఆచార్య చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఏ మాత్రం అల‌రించ‌లేక‌పోయింది. క్రేజీ కాంబినేష‌న్‌లో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొని ఉండ‌గా, ఆచార్య రిలీజ్ త‌ర్వాత ఇటు ఫ్యాన్స్‌ని, అటు ప్రేక్ష‌కుల‌ను ఈ సినిమా మెప్పించ‌లేక‌పోయింది. ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద తొలి ఆట నుంచే ఆశించిన టాక్‌ను రాబ‌ట్టుకోలేక‌పోయింది. తొలి రోజు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్‌కు, మూడో రోజు క‌లెక్ష‌న్స్‌కు సంబంధ‌మే క‌నిపించ‌టం లేదు. హాలీడే స‌మ‌యంలోనూ ఈ సినిమా పెద్ద‌గా వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌క‌పోవ‌డం విశేషం.

Acharya flop talk Akkineni fans celebrate
Acharya

అయితే ఆచార్య ఇంత దారుణంగా విఫ‌లం అవ్వ‌డం చూసి మిగ‌తా హీరోలు పండ‌గ చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే మంచు ఫ్యామిలీ ఖుష్ అవుతుంద‌ని వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు అక్కినేని హీరోలు కూడా ఫుల్ సెల‌బ్రేట్ చేసుకుంటున్నార‌ట‌. మెగా హీరోల ప్రాజెక్ట్‌లతో పోలిస్తే అక్కినేని హీరోల‌ సినిమాలకు తక్కువ కలెక్షన్లు వ‌చ్చేవి. దీంతో అక్కినేని అభిమానులు చాలా నిరుత్సాహ‌ప‌డేవారు. కానీ ఆచార్య విష‌యంలో చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించినా కూడా బంగార్రాజు సినిమా అంత హిట్ కాలేక‌పోయింది. ఈ క్ర‌మంలోనే ఆచార్య‌కు త‌క్కువ కలెక్ష‌న్లు వ‌చ్చాయి. బంగార్రాజు అన్ని క‌లెక్ష‌న్లు కూడా రాక‌పోయే స‌రికి ఈ సారికి అక్కినేని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. ఎట్ట‌కేల‌కు త‌మ హీరోల‌కు మెగా హీరోల సినిమాల క‌న్నా ఎక్కువ క‌లెక్ష‌న్లు వ‌చ్చాయ‌ని వారు సంబ‌ర‌ప‌డుతున్నారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్‌కు, మెగా ఫ్యాన్స్‌కు మ‌ధ్య సోష‌ల్ మీడియాలో పోస్టులు, కామెంట్ల వార్ న‌డుస్తోంది.

ఇక బంగార్రాజులో ఉన్న కాంబో సీన్లు కూడా ఆచార్యలో లేవ‌ని అంటున్నారు. అది వాస్త‌వ‌మే. ఫ్యామిలీ మెంబ‌ర్స్ క‌లిసి తీసిన సినిమాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు అక్కినేని వారివే హిట్ అయ్యాయి. మ‌నం, బంగార్రాజు వంటి చిత్రాల్లో అక్కినేని హీరోల సీన్లు బాగా పండాయి. కానీ ఆచార్య‌లో చిరు, చ‌ర‌ణ్‌లు పూర్తి స్థాయి పాత్ర‌ల్లో న‌టించినా.. వారి మ‌ధ్య అక్కినేని హీరోల అంత‌టి కాంబో సీన్లు రాలేద‌ని అంటున్నారు. ఇది ఆచార్యకు మైన‌స్ అయింద‌ని అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇక ఇండ‌స్ట్రీతోపాటు అభిమానుల మ‌ధ్య‌ జ‌రిగే కొన్ని వార్స్ ఆస‌క్తికరంగా మారుతుంటాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం అలాంటి యుద్ధ‌మే అక్కినేని, మెగా ఫ్యాన్స్ మ‌ధ్య న‌డుస్తోంది. ఇక ఈ సినిమా ఎడిటింగ్‌లో చాలా మందిని లేపేశార‌ని టాక్. ఆచార్య‌లో కాజల్ మాత్రమే కాదు. కాజల్ కాంబినేషన్ లో ఉన్న దాదాపు నలుగురైదుగురు నటుల సీన్స్ ను ఎడిటింగ్ లో లేపేశారు కొరటాల.‌ లాహె లాహె పాటలో కాజల్ సంగీత తో కలిసి వేసే స్టెప్పులలో అక్కడక్కడా కమెడియన్ సత్య, జబర్దస్త్ శీను, చంద్ర లాంటి వాళ్లు కనిపించేవారు. ఎప్పుడయితే కాజల్ సీన్స్ కట్ చేయాలనుకున్నారో, టోటల్ కాంబో సీన్స్ లో ఉన్న ఆర్టిస్ట్ ల‌ని లేపేయ‌డం సినిమాకి మైన‌స్‌గా మారింద‌నే చెప్పాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now