Abbavaram Kiran : ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం.. రోడ్ యాక్సిడెంట్‌లో యువ హీరో సోద‌రుడు మృతి..

December 1, 2021 2:31 PM

Abbavaram Kiran : ఈ మ‌ధ్య సినీ ప‌రిశ్ర‌మ‌లో వ‌రుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక‌రి మృతిని మ‌ర‌చిపోక ముందే మ‌రొక‌రు క‌న్ను మూస్తున్నారు. చాలా తక్కువ వ్యవధిలోనే శివశంకర్ మాస్టర్, లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రిని పోగొట్టుకుంది ఇండస్ట్రీ. దీన్నుంచి తేరుకోక‌ముందే ఓ యంగ్ హీరో ఇంట్లో విషాదం నెల‌కొంది.

Abbavaram Kiran : ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం.. రోడ్ యాక్సిడెంట్‌లో యువ హీరో సోద‌రుడు మృతి..

యువ హీరో అబ్బవరం కిరణ్ సోదరుడు రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు తాజా సమాచారం. కడప జిల్లా చెన్నూరు వద్ద రోడ్డు ప్రమాదం జరగగా, తీవ్రంగా గాయపడిన రామాంజులు కన్నుమూశాడు. అబ్బవరం రామాంజులు రెడ్డి సంబేపల్లె మండలం దుద్యాల గ్రామంలో నివసిస్తున్నాడు. ఇక అబ్బవరం కిరణ్ .. ఎస్ఆర్ కల్యాణ మండపం చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించి అల‌రించిన విష‌యం తెలిసిందే.

రాజావారు రాణిగారు, ఎస్‌ఆర్‌ కల్యాణమండపం.. చిత్రాలతో మెప్పించిన కిర‌ణ్.. ప్రస్తుతం..సమ్మతమే, సెబాస్టియన్‌ పీసీ 524.. సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే కిరణ్‌ మరో ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. రమేశ్‌ కాడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ క్లాప్‌ కొట్టగా మరో దర్శకుడు బాబీ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. డైరెక్టర్‌ మలినేని గోపీచంద్‌ ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment