83 Movie : 83 మూవీ త్వ‌ర‌లోనే ఓటీటీలో స్ట్రీమింగ్.. ఎందులో అంటే..?

January 29, 2022 9:30 PM

83 Movie : బ‌యోపిక్‌లు అంటే స‌హ‌జంగానే ప్రేక్ష‌కులు ఆ త‌ర‌హా సినిమాల‌ను ఆద‌రిస్తుంటారు. ఒక‌టి రెండు సినిమాలు త‌ప్ప చాలా వ‌ర‌కు బ‌యోపిక్‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లుగానే నిలిచాయి. ఇక భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్‌, ఆల్ రౌండ‌ర్ క‌పిల్ దేవ్ జీవితం ఆధారంగా తెర‌కెక్కిన 83 మూవీ కూడా ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది.

83 Movie to stream very soon on OTT

83 మూవీలో క‌పిల్‌దేవ్ పాత్ర‌ను ర‌ణ్ వీర్ సింగ్ పోషించారు. క‌పిల్ భార్య‌గా ర‌ణ్ వీర్ స‌ర‌స‌న దీపికా ప‌దుకొనె న‌టించారు. క‌బీర్‌ఖాన్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మూవీ గ‌తేడాది డిసెంబ‌ర్ 24న విడుద‌లై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలో ఈ మూవీ విదేశాల్లోనూ చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

అయితే ఈ మూవీ విడుద‌ల‌య్యే స‌మ‌యానికి క‌రోనా కేసులు పెరుగుతుండ‌డం, ప‌లు చోట్ల థియేట‌ర్లు మూసి ఉండ‌డం, కొన్ని చోట్ల ఆంక్ష‌లు ఉండ‌డంతో చిత్ర క‌లెక్ష‌న్ల‌పై ఆ ప్ర‌భావం ప‌డింది. అయిన‌ప్ప‌టికీ ఓవ‌రాల్‌గా చూస్తే ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించింద‌నే చెప్పాలి. ఇక ఈ మూవీ త్వ‌ర‌లోనే ఓటీటీలో స్ట్రీమ్ కానుంది.

ప్ర‌ముఖ ఓటీటీ యాప్ నెట్ ఫ్లిక్స్ 83 సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను కొనుగోలు చేసింది. ఈ క్ర‌మంలోనే ఫిబ్ర‌వ‌రి 18వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌తోపాటు హాట్ స్టార్‌లోనూ ఈ మూవీని స్ట్రీమ్ చేయ‌నున్నారు. హిందీ, తెలుగు, త‌మిళం, మ‌ళ‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

1983లో క‌పిల్ దేవ్ కెప్టెన్ గా ఉన్న‌ప్పుడు టీమిండియా సాధించిన వ‌ర‌ల్డ్ క‌ప్ క‌థ ఆధారంగా ఈ మూవీని తెర‌కెక్కించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment