lifestyle

Watermelon Smoothie : పుచ్చ‌కాయ‌ల‌తో స్మూతీ త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది, ఆరోగ్య‌క‌రం కూడా..!

Watermelon Smoothie : వేస‌విలో పుచ్చ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. పుచ్చ‌కాయ‌ల వ‌ల్ల మ‌న శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం అందుతుంది. అలాగే డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. దీంతోపాటు ప‌లు ముఖ్య‌మైన విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ మ‌న‌కు పుచ్చ‌కాయ‌ల ద్వారా ల‌భిస్తాయి. అయితే పుచ్చకాయ‌ల‌ను నేరుగా తిన‌డంతోపాటు దాంతో చ‌ల్ల చ‌ల్ల‌గా స్మూతీ త‌యారు చేసుకుని తాగినా.. మ‌న‌కు అవే లాభాలు క‌లుగుతాయి. ఈ క్ర‌మంలోనే వాట‌ర్‌మిల‌న్ స్మూతీని ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వాట‌ర్‌మిల‌న్ స్మూతీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పుచ్చ‌కాయ ముక్క‌లు (విత్త‌నాలు తీసి క‌ట్ చేయ‌బ‌డిన‌వి) – ఒక‌టిన్నర క‌ప్పు, స్ట్రాబెర్రీలు – ఒక క‌ప్పు, బాగా పండిన అర‌టి పండు – స‌గం, బాదం పాలు – 1/2 నుంచి 3/4 క‌ప్పు, నిమ్మ‌ర‌సం – 1 టీస్పూన్, చియా విత్త‌నాలు – 1 టేబుల్ స్పూన్.

Watermelon Smoothie

వాట‌ర్ మిల‌న్ స్మూతీ త‌యారు చేసే విధానం..

పైన చెప్పిన అన్ని ప‌దార్థాల‌ను బ్లెండ‌ర్‌లో వేసి చ‌క్క‌ని చిక్క‌ని స్మూతీ వ‌చ్చేలా ప‌ట్టుకోవాలి. అవ‌స‌రం అనుకుంటే బాదం పాలను ఎక్కువ‌గా పోయ‌వచ్చు. లేదా స్ట్రాబెర్రీలు, ఐస్ వేసుకోవ‌చ్చు. ఇక టేస్ట్ కోసం నిమ్మ‌ర‌సం క‌లుపుకోవ‌చ్చు. తియ్య‌గా ఉండాల‌నుకుంటే అర‌టి పండు మోతాదు పెంచ‌వ‌చ్చు. లేదా పుచ్చ‌కాయ ముక్క‌లు మ‌రిన్ని వేసుకోవ‌చ్చు. దీంతో వాట‌ర్ మిల‌న్ ఫ్లేవ‌ర్ ఎక్కువ‌గా వ‌స్తుంది. ఈ స్మూతీపై అలంక‌ర‌ణ కోసం చియా సీడ్స్ వేయ‌వ‌చ్చు. దీంతో చ‌ల్ల చ‌ల్ల‌ని వాట‌ర్ మిల‌న్ స్మూతీ త‌యారు అవుతుంది. దీన్ని 2, 3 రోజుల వ‌ర‌కు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి తాగ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM