lifestyle

Papaya : జీర్ణ వ్య‌వ‌స్థ‌, చ‌ర్మ స‌మ‌స్య‌లు, అధిక బ‌రువుకు మేలైన ఆహారం.. బొప్పాయి..!

Papaya : బొప్పాయి పండు మ‌న‌కు ఏడాది పొడ‌వునా దొరుకుతుంది. అన్ని సీజ‌న్ల‌లోనూ దీన్ని తిన‌వ‌చ్చు. దీంట్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ముఖ్య పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. విట‌మిన్ ఎ, బి, సి, డిలు బొప్పాయి పండ్ల‌లో పుష్క‌లంగా ఉంటాయి. దీంతోపాటు ఫైబ‌ర్‌, కాల్షియం, ఐర‌న్‌, మెగ్నిషియం, పొటాషియం వంటి పోష‌కాలు కూడా బొప్పాయి పండ్ల‌లో ఉన్నాయి. ఈ క్ర‌మంలో బొప్పాయి తింటే మ‌న‌కు క‌లిగే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు కూడా. బొప్పాయి వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చర్మ సంరక్షణకు బొప్పాయి బాగా పనిచేస్తుంది. దీన్ని ముఖానికి ఫేస్‌ప్యాక్‌గా వేసి వాడుకోవచ్చు. ముఖంపై ఏర్పడిన మచ్చలకు, మొటిమలకే కాక, వివిధ చర్మ వ్యాధులకు కూడా ఉపయోగించవచ్చు.

చర్మంలో ఏర్పడే మృత కణాలను పోగొడుతుంది. చర్మం మరింత ప్రకాశించేందుకు బొప్పాయి తోడ్పడుతుంది. వయస్సు మీద పడిన వారిలోనూ ఇది తన ప్రభావాన్ని చూపిస్తుంది. వారి సౌందర్యాన్ని పెంచుతుంది. శరీరంలోని రక్తకణాలలోని కొవ్వును తీసివేయడంతోపాటు గుండెపోటు రానీయకుండా చూస్తుంది. శరీరంలో హాని కలిగించే టాక్సిన్లను బొప్పాయి తొలగిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థకు చక్కని ఔషధంగా పనిచేస్తుంది. రోజూ బొప్పాయిని మన ఆహారంలో భాగంగా చేసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తవు. మలబద్దకానికి బొప్పాయి మంచి మందు. గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు నిత్యం బొప్పాయి తింటే ఫ‌లితం ఉంటుంది.

Papaya

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది..

విటమిన్ ఎ, సిలు బొప్పాయిలో ఉంటాయి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు బొప్పాయిలో ఉన్నాయి. జ్వరం, జలుబు, ఫ్లూతో బాధపడే వారు దీన్ని తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. రోజూ బొప్పాయి తినడంవల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మహిళల్లో తలెత్తే రుతు సంబంధ సమస్యలను తొలగిస్తుంది. కాలేయ సమస్యలను నివారిస్తుంది. కాలేయంలో ఉండే క్యాన్సర్ కారక క్రిములను నాశనం చేస్తుంది. అధిక బరువు ఉన్నవారు నిత్యం బొప్పాయిని తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇందులో ఉన్న పోషకాలు తక్కువ క్యాలరీలను అందజేస్తాయి. సన్నగా మారాలనే వారికి బొప్పాయి మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. చుండ్రు సమస్యతో బాధపడేవారు బొప్పాయి గుజ్జులో నాలుగు చుక్కల నిమ్మరసం, వెనిగర్ కలిపి తలకు పట్టించి గంటయ్యాక తలస్నానం చేస్తే సమస్యకు తగిన పరిష్కారం లభిస్తుంది.

పచ్చి బొప్పాయిని మెత్తని ముద్దగా చేసి దాని నుంచి రసం తీసి కొబ్బరి నూనెలో కలపాలి. ఆ నూనెను తలస్నానానికి ముందు రోజు రాస్తే ఫలితం ఉంటుంది. బొప్పాయి, అరటి గుజ్జును సమపాళ్లలో తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమంలో నాలుగు చుక్కల వెనిగర్, కొంత నీరు కలిపి ముఖానికి మర్దనా చేసుకుని కడిగేస్తే చర్మం శుభ్రపడుతుంది. ఇది చక్కని క్లీన్సర్‌గా పనిచేస్తుంది. చర్మం గరుకుగా ఉంటే బొప్పాయి గుజ్జును రాసి కొంత సేపటి తరువాత నీటితో క‌డిగి మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదుత్వాన్ని పొందుతుంది. బొప్పాయి కలిపిన ముల్తానీ మట్టితో తరచూ పూత వేసుకోవడం వల్ల ముడతల సమస్యను త‌గ్గించుకోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రాజా సాబ్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా.. చిత్ర యూనిట్‌కు ప్రభాస్ గిఫ్టులు! ‘డార్లింగ్’ అంటే అంతే మరి..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…

Saturday, 24 January 2026, 9:49 PM

బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. టీ20 వరల్డ్ కప్ నుంచి అవుట్! స్కాట్లాండ్‌కు బంపర్ ఆఫర్..

భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…

Saturday, 24 January 2026, 5:25 PM

BSSC ఇంటర్ లెవల్ నోటిఫికేషన్ 2026: అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు!

బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…

Saturday, 24 January 2026, 10:15 AM

రాయ్‌పూర్ టీ20: కివీస్‌పై భారత్ ఘనవిజయం.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం!

రాయ్‌పూర్ వేదికగా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని…

Friday, 23 January 2026, 10:53 PM

పప్పులను వండే ముందు నానబెడుతున్నారా? లేదంటే డేంజరే.. న్యూట్రిషనిస్ట్ చెబుతున్న షాకింగ్ నిజాలు!

భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…

Friday, 23 January 2026, 8:02 PM

విశ్లేషణ: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వయంకృతాపరాధం.. పాక్ మాటలు నమ్మి వరల్డ్ కప్‌కు దూరం?

ఎదుటి వ్య‌క్తి క‌ష్టాల్లో ఉంటే అత‌ని ప‌రిస్థితిని కొంద‌రు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆస‌రాగా చేసుకుని త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాలు…

Friday, 23 January 2026, 3:54 PM

మీ పాన్ కార్డు పోయిందా? స్మార్ట్‌ఫోన్‌లోనే ‘ఇ-పాన్’ డౌన్‌లోడ్ చేసుకోండి.. పూర్తి ప్రాసెస్ ఇదే!

ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…

Friday, 23 January 2026, 9:51 AM

అల్లు అర్జున్ పోస్ట్‌పై నయనతార ఇంట్రెస్టింగ్ రియాక్షన్.. మెగాస్టార్ సినిమాపై ‘పుష్ప’రాజ్ పోస్ట్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…

Thursday, 22 January 2026, 4:46 PM