Thippatheega : మన చుట్టూ ప్రకృతిలో అనేక రకాల మొక్కలు ఉంటాయి. వాటిల్లో అనేక ఔషధ గుణాలు ఉండే మొక్కలు కూడా ఉంటాయి. కానీ వాటిని మనమే గుర్తించలేకపోతున్నాం. ఇక అలాంటి మొక్కల్లో తిప్పతీగ కూడా ఒకటి. ఇది మన పరిసరాల్లోనే ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే తిప్పతీగ మనకు ఎక్కడో ఒక చోట కనిపిస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే తిప్పతీగ మనకు ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తుంది. అయితే ఆయుర్వేద ప్రకారం తిప్పతీగ మనకు ఆరోగ్య ప్రదాయిని అని చెప్పవచ్చు. తిప్పతీగను వాడడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
తిప్పతీగ ఆకులకు చెందిన రసాన్ని మనం రోజూ తాగవచ్చు. ఈ రసాన్ని తాగలేకపోతే మనకు మార్కెట్‌లో తిప్పతీగ ట్యాబ్లెట్లు కూడా లభిస్తాయి. అయితే వీటిని వైద్యుల పర్యవేక్షణలో ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక తిప్పతీగ రసాన్ని మనం రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక టీస్పూన్ సేవించినా చాలు.. మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. తిప్పతీగ రసాన్ని తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. దగ్గు, జలుబు, జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. అలాగే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు వచ్చినా కూడా తిప్పతీగ మనకు ఉపయోగకరంగా ఉంటుంది.
తిప్పతీగ జ్యూస్‌ను తాగడం వల్ల ప్లేట్‌లెట్లు పెరుగుతాయి. దీంతో డెంగ్యూ నుంచి త్వరగా కోలుకుంటారు. ఈ ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అందువల్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. షుగర్ వ్యాధి ఉన్నవారు రోజూ తిప్పతీగ ఆకుల రసాన్ని సేవిస్తుంటే షుగర్ లెవల్స్ దెబ్బకు అదుపులోకి వస్తాయి. అలాగే కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి.
ఈ ఆకుల రసాన్ని సేవించడం వల్ల జీర్ణ సమస్యల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. గ్యాస్, కడుపులో మంట, మలబద్దకం ఉండవు. ఈ రసాన్ని తాగుతుంటే చర్మ వ్యాధులు సైతం నయం అవుతాయి. మార్కెట్‌లో మనకు తిప్పతీగ జ్యూస్ కూడా లభిస్తుంది. దీన్ని తెచ్చుకుని కూడా ఉపయోగించవచ్చు. అయితే తిప్పతీగ రసం అందరికీ పడదు. అందువల్ల దీన్ని తాగితే అలర్జీలు లేదా డయేరియా వంటివి కలిగితే వెంటనే ఈ రసాన్ని తాగడం ఆపేయాలి. లేదంటే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…