lifestyle

Moringa Leaves Juice : మున‌గాకుల ర‌సాన్ని ఇలా తాగితే.. బ‌రువు త‌గ్గ‌డం ఖాయం..!

Moringa Leaves Juice : ప్రస్తుత తరుణంలో చాలామంది అధిక బరువుతో బాధ‌ప‌డుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. జీవనశైలిలో మార్పులు రావడం ప్రధాన కారణం. అధికంగా బరువు ఉన్నవారు బరువు తగ్గేందుకు అనేక‌ మార్గాలను అనుసరిస్తుంటారు. అందులో భాగంగానే ఆహారం కూడా తీసుకుంటారు. కొందరు జిమ్‌లో గంట‌ల‌ తరబడి సాధన చేస్తారు. అయినప్పటికీ బరువు తగ్గడం లేదని ఫిర్యాదు చేస్తారు. అయితే జీవ‌న‌శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే మీ బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. మునగాకుల రసం బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

మునగాకులు చాలామందికి తెలుసు కానీ అవి బరువును తగ్గిస్తాయని చాలామందికి తెలియదు. బరువు తగ్గించే ప్రయాణంలో ఉన్నవారు మునగాకుల రసాన్ని తప్పకుండా తీసుకోవాలి. మీ డైట్ లో మునగాకుల రసాన్ని చేర్చుకుంటే అనేక లాభాలు ఉంటాయి. మునగాకుల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఎన్నో సంవత్సరాల నుంచి వీటిని ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. మునగాకులో ప్రోటీన్లు, ఫైబర్, క్లోరోజెనిక్ యాసిడ్, మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. అంతేకాకుండా ఇతర వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. మునగాకుల రసాన్ని తీసుకోవడం వల్ల తక్కువ క్యాలరీ లభిస్తాయి. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కనుక మీ పొట్టను చాలా సమయం పాటు నిండుగా ఉన్నట్టు చేస్తుంది. అందువల్ల మీరు తక్కువ ఆహారం తీసుకుంటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.

Moringa Leaves Juice

మునగాకుల రసాన్ని తాగితే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. డయాబెటిస్ నియంత్రణలోకి వస్తుంది. జీవక్రియలు వేగవంతం అవుతాయి. దీంతో బరువు తగ్గడం చాలా తేలిక అవుతుంది. మునగాకుల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువు తగ్గడంలో కూడా మనకు సహాయపడతాయి. మునగాకుల రసాన్ని తాగితే రోగనిరోధక శక్తి పెరిగి జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. శరీరంలోని వాపులు. నొప్పులు తగ్గుతాయి. బిపి అదుపులోకి వస్తుంది. చర్మం యవ్వనంగా ఉంటుంది, కాంతివంతంగా మారుతుంది. ఇక మున‌గాకుల రసాన్ని ఎలా తయారు చేయాలంటే.. ముందు మునగ ఆకులను కడగాలి, వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి పేస్టులా పట్టుకోవాలి, తర్వాత దాన్నుంచి రసం తీయాలి, ఆ రసాన్ని ఫిల్టర్ చేసి తాగొచ్చు. అందులో కావాలంటే నిమ్మరసం, తేనె కలిపి కూడా తాగవచ్చు. ఇలా మునగాకుల రసాన్ని తాగితే అధిక బరువు తగ్గుతారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM