lifestyle

Indigestion Remedies : తిన్న ఆహారం అస‌లు జీర్ణ‌మ‌వ్వ‌ట్లేదా.. అయితే ఇలా చేయండి చాలు..!

Indigestion Remedies : మ‌నం తినే ఆహారాల‌ను జీర్ణం చేయ‌డంతోపాటు వాటిలో ఉండే పోష‌కాల‌ను మ‌న శ‌రీరానికి అందేలా చూడ‌డంలో జీర్ణ వ్య‌వ‌స్థ పాత్ర చాలా కీల‌క‌మైంది. దీంతోపాటు ఆ ఆహార ప‌దార్థాల్లో ఉండే వ్య‌ర్థాల‌ను కూడా జీర్ణ‌వ్య‌వ‌స్థ బ‌య‌టకు పంపుతుంది. అయితే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు స‌రిగ్గా లేక‌పోతే గ్యాస్‌, అసిడిటీ, క‌డుపు నొప్పి, అజీర్ణం, విరేచ‌నాలు త‌దిత‌ర స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగుప‌రుచుకునేందుకు కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవాలి. దీంతో జీర్ణం బాగా అవ‌డ‌మే కాదు, ఆయా జీర్ణ స‌మ‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే..

పెరుగులో ప్రొ బ‌యోటిక్స్ పుష్క‌లంగా ఉంటాయి. అంటే మ‌న శ‌రీరానికి మంచి చేసే బాక్టీరియా అన్న‌మాట‌. ఇది మ‌న జీర్ణాశ‌యం, పేగుల్లో ఉంటుంది. ఈ బాక్టీరియా సంఖ్య‌ను పెంచితే మ‌న‌కు జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అందుకు గాను నిత్యం మ‌నం పెరుగు లేదా మ‌జ్జిగ‌ను తీసుకోవాలి. దీంతో జీర్ణ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. యాపిల్ పండ్ల‌లో పుష్క‌లంగా ఉండే పెక్టిన్ అనే సాల్యుబుల్ ఫైబ‌ర్ జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది. మ‌నం తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌య్యేందుకు దోహ‌ద‌ప‌డుతుంది. క‌నుక నిత్యం యాపిల్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు.

Indigestion Remedies

సోంపు గింజ‌ల్లో ఉండే ఫైబ‌ర్ జీర్ణాశ‌యంలో ఆహారం క‌ద‌లిక‌ను స‌రిచేస్తుంది. దీంతో క‌డుపు నొప్పి, అజీర్ణం, గ్యాస్ రాకుండా ఉంటాయి. తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతుంది. మ‌నం భోజ‌నం చేసిన వెంట‌నే తిన‌ద‌గిన పండ్ల‌లో బొప్పాయి పండు కూడా ఒక‌టి. ఇందులో ఉండే ప‌పెయిన్ అనే ఎంజైమ్ మ‌నం తిన్న ఆహారాన్ని స‌రిగ్గా జీర్ణం చేస్తుంది. దీంతో గ్యాస్, అసిడిటీ రాకుండా ఉంటాయి. మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. బీట్‌రూట్‌లో ఉండే ఫైబ‌ర్ మ‌నం తిన్న ఆహారాన్ని త్వ‌ర‌గా జీర్ణం చేస్తుంది. అలాగే పెద్ద పేగులో మ‌లం క‌ద‌లిక‌ను స‌రి చేస్తుంది. దీంతో మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌దు.

నిత్యం ఉద‌యాన్నే అల్పాహారానికి ముందు కొద్దిగా అల్లం ర‌సం సేవిస్తే.. మ‌నం తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. అలాగే వికారం, వాంతులు త‌గ్గుతాయి. గ్యాస్‌, అసిడిటీ రాకుండా ఉంటాయి. భోజ‌నానికి ముందు పుదీనా ర‌సం తీసుకుంటే జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. విరేచ‌నాలు ఆగుతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM