Veg Manchuria : మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో లభించే ఆహారాల్లో మంచురియా కూడా ఒకటి. మంచురియా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. అయితే బయట తయారు చేసే మంచురియాలో సాసెస్ ను ఎక్కువగా వేస్తూ ఉంటారు. సాసెస్ వేయకుండా రుచిగా కూడా మనం మంచురియాను తయారు చేసుకోవచ్చు. వీకెండ్స్ లో, స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా మనం మంచురియాను తయారు చేసి తీసుకోవచ్చు. సాసెస్ లేకుండా రుచిగా మంచురియాను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాబేజి తురుము – ఒక కప్పు, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, మిరియాల పొడి – చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, మైదాపిండి – అర కప్పు, కార్న్ ఫ్లోర్ – 3 టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
నూనె – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన కరివేపాకు – 2 రెమ్మలు, పసుపు – పావు టీ స్పూన్, కాశ్మీరి కారం – ఒక టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, టమాట – 1, ఉప్పు – కొద్దిగా, కార్న్ ఫ్లోర్ – ఒక టీ స్పూన్, నిమ్మరసం – కొద్దిగా.
ముందుగా గిన్నెలో క్యాబేజి తురుమును తీసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలు వేసి బాగా కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి మరీ పలుచగా కాకుండా ఉండేలా చూసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత టాసింగ్ కు ఇనుమ కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి పెద్ద మంటపై వేయించాలి. తరువాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత పసుపు, కాశ్మీరి కారం, గరం మసాలా వేసి కలపాలి. తరువాత టమాటాను ఫ్యూరీలాగా చేసి వేసుకోవాలి. దీనిని నూనె పైకి తేలే వరకు ఉడికించిన తరువాత కార్న్ ఫ్లోర్ లో నీళ్లు పోసి కలిపి వేసుకోవాలి. తరువాత ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు ముందుగా వేయించిన మంచురియా వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా బాగా కలుపుకున్న తరువాత చివరగా నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మంచురియా తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా చాలా సులభంగా ఇంట్లోనే మనం మంచురియాను తయారు చేసి తీసుకోవచ్చు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్‌ను ప్రస్తుతం జూనియర్ ఎన్‌టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…