Cardamom : రోజూ ప‌ర‌గ‌డుపునే 2 యాల‌కుల‌ను తింటే క‌లిగే లాభాలు ఇవే..!

January 15, 2026 9:13 PM

Cardamom : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే యాల‌కుల‌ను త‌మ వంట ఇంటి ప‌దార్థంగా ఉప‌యోగిస్తున్నారు. ఇవి సుగంధ ద్ర‌వ్యాల జాబితాకు చెందుతాయి. వీటిని మ‌నం త‌ర‌చూ వంటల్లో వేస్తుంటాం. యాల‌కుల‌ను ఎక్కువ‌గా తీపి వంట‌కాల త‌యారీలో వాడుతారు. అయితే వాస్త‌వానికి యాల‌కుల‌ను మనం రోజూ తిన‌వ‌చ్చు. రోజూ ప‌ర‌గ‌డుపునే రెండు యాల‌కుల‌ను తిని గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. ఇక యాల‌కుల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో ఇప్పుడు చూద్దాం.

అధిక బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్న వారికి యాల‌కులు ఒక వ‌రం అనే చెప్ప‌వ‌చ్చు. యాల‌కుల‌ను తిని నీళ్ల‌ను తాగితే శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. దీంతో క్యాల‌రీలు త్వ‌ర‌గా ఖ‌ర్చ‌వుతాయి. ఫ‌లితంగా కొవ్వు క‌రుగుతుంది. త‌ద్వారా అధిక బ‌రువు త‌గ్గుతారు. ఇక యాల‌కుల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా గ్యాస్‌, అజీర్తి, క‌డుపు ఉబ్బ‌రం, క‌డుపు నొప్పి, మ‌ల‌బ‌ద్ద‌కం ఉన్న‌వారు రోజూ యాల‌కుల‌ను తింటే ఫ‌లితం ఉంటుంది. యాల‌కుల‌లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి.

health benefits of taking daily 2 Cardamom on empty stomach
Cardamom

అందువ‌ల్ల యాల‌కుల‌ను తింటే శ‌రీరంలో నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య ఉన్న‌వారికి యాల‌కులు ఎంత‌గానో మేలు చేస్తాయి. యాల‌కులను రోజూ తిన‌డం వ‌ల్ల ఆర్థ‌రైటిస్ నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. యాల‌కుల‌ను తింటే నోట్లోని బాక్టీరియా న‌శిస్తుంది. దీంతో నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. అలాగే దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

యాల‌కుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను పెంచుతాయి. దీంతో సీజ‌న‌ల్ వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. అలాగే ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. ఇక యాల‌కుల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ కూడా త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇలా యాల‌కుల‌తో మ‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. క‌నుక వీటిని రోజూ తినాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now