lifestyle

Orange Peels : ఈ లాభాలు తెలిస్తే ఇక‌పై మీరు నారింజ పండ్ల తొక్క‌ల‌ను ప‌డేయ‌రు..!

Orange Peels : నారింజ పండ్ల‌ను తినడం వ‌ల్ల మ‌న‌కు ఎన్ని లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. నారింజ పండ్ల‌లో అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. అవ‌న్నీ మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మే. ఈ పండ్ల‌లో ఉండే విట‌మిన్ సి మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. దీంతో సీజ‌న‌ల్ వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. అయితే నారింజ పండ్లే కాదు.. వాటి తొక్క‌ల్లోనూ అనేక పోష‌కాలు ఉంటాయి. కానీ చాలా మంది నారింజ పండ్ల‌ను తిన్న త‌రువాత తొక్క‌ల‌ను ప‌డేస్తుంటారు. అలా చేయ‌కండి. నారింజ పండ్ల తొక్క‌ల‌ను స‌రిగ్గా ఉప‌యోగించాలే కానీ మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

నారింజ పండ్లు తొక్క‌ల ద్వారా మ‌న‌కు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు మాత్ర‌మే కాదు, మ‌నం వాటిని ఇంకా ఎన్నో ర‌కాలుగా వాడ‌వ‌చ్చు. నారింజ పండ్ల తొక్క‌ల్లో విట‌మిన్ సి, డైట‌రీ ఫైబ‌ర్‌, విట‌మిన్ ఎ, క్యాల్షియం, ఫోలేట్ వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల ఈ తొక్క‌ల‌ను నీటిలో వేసి మ‌రిగించి తాగితే మ‌నం ఆయా పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు. అలాగే ఈ తొక్క‌ల్లో డి-లిమోనీన్ అనే స‌మ్మేళ‌నం స‌మృద్ధిగా ఉంటుంది. అందువ‌ల్ల నారింజ పండు తొక్క‌ల‌ను క్లీన్ చేసే ప‌దార్ధంగా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు.

క్లీనింగ్ పదార్థంగా వాడ‌వ‌చ్చు..

నారింజ పండు తొక్క‌ల్లో ఉండే డి-లిమోనీన్ అనే స‌మ్మేళ‌నం నాచుర‌ల్ డిగ్రీజ‌ర్‌, డిసిన్‌ఫెక్టెంట్‌గా ప‌నిచేస్తుంది. అందువ‌ల్ల ఈ తొక్క‌ల‌ను ఉప‌యోగించి పాత్ర‌ల‌ను క్లీన్ చేయ‌వ‌చ్చు. దీంతో వాటిపై ఉండే మొండి మ‌ర‌క‌లు కూడా పోతాయి. అలాగే చెక్క ఫ‌ర్నిచ‌ర్‌కు ఈ తొక్క‌ల‌తో పాలిష్ వేయ‌వ‌చ్చు. సింపుల్‌గా ఈ తొక్క‌ల‌ను ఫ‌ర్నిచ‌ర్‌పై రుద్దితే చాలు, ఫ‌ర్నిచ‌ర్ మెరుస్తుంది. అలాగే వెనిగ‌ర్‌లో ఈ తొక్క‌ల‌ను నాన‌బెట్టి వాడితే ఆ ద్ర‌వం చక్క‌ని క్లీనింగ్ స్ప్రే గా కూడా ప‌నిచేస్తుంది.

నారింజ పండు తొక్క‌ల‌ను ఫ్రిజ్‌లో పెడితే ఫ్రిజ్ నుంచి వ‌చ్చే దుర్వాస‌న పోతుంది. ఈ తొక్క‌ల‌ను చెత్త డ‌బ్బాలో కూడా ఉంచ‌వ‌చ్చు. దీంతో అందులో నుంచి వ‌చ్చే వాస‌న కూడా పోతుంది. అలాగే మీ చేతుల నుంచి వెల్లుల్లి లేదా ఉల్లిపాయల స్మెల్ వ‌స్తుంటే మీ చేతుల‌కు నారింజ పండు తొక్క‌ల‌ను రుద్దాలి. దీంతో వాటి వాస‌న పోతుంది. నారింజ పండు తొక్క‌ల‌ను వేసి మ‌రిగించిన నీళ్ల‌ను మీరు చ‌క్క‌ని రూమ్ ఫ్రెష‌న‌ర్‌ గా కూడా వాడ‌వ‌చ్చు. నారింజ పండు తొక్క‌ల‌ను వేయ‌డం వల్ల చేదుగా ఉండే వంట‌ల‌కు రుచి వ‌స్తుంది.

Orange Peels

మొక్క‌ల‌కు ఎరువుగా వాడ‌వ‌చ్చు..

ఈ తొక్క‌ల‌ను ఉప‌యోగించి కేక్స్‌, కుకీస్‌, మారినేడ్స్ త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే వీటిని ఎండ బెట్టి పొడి చేసి స్నాక్స్ త‌యారీలో ఉప‌యోగించ‌వ‌చ్చు. నారింజ పండు తొక్క‌ల‌ను మీ ఇంట్లో మొక్క‌ల‌కు ఎరువుగా కూడా వేయ‌వ‌చ్చు. అలాగే ఈ తొక్క‌ల‌ను కిటికీలు, కిచెన్‌లో అక్క‌డ‌క్క‌డా ఉంచితే పురుగులు, బొద్దింక‌ల బెడ‌ద నుంచి విముక్తి ల‌భిస్తుంది. నారింజ పండు తొక్క‌ల‌ను పేస్ట్‌లా చేసి ఫేస్ ప్యాక్‌గా కూడా వాడ‌వ‌చ్చు. దీంతో మీ ముఖం కాంతివంతంగా మారి మెరిసిపోతుంది. ఇలా నారింజ పండు తొక్క‌ల‌తో అనేక విధాలుగా ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి క‌నుక ఇక‌పై వాటిని ప‌డేయ‌కండి. ఎంచ‌క్కా పైన చెప్పిన విధంగా మీకు న‌చ్చిన‌ట్లు వాటిని ఉప‌యోగించుకోండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM