lifestyle

Beard Growth Tips : గడ్డం పెర‌గాల‌ని కోరుకుంటున్నారా.. అయితే ఈ త‌ప్పులు చేస్తున్నారేమో చూడండి..!

Beard Growth Tips : పురుషుల్లో కొంద‌రు గ‌డ్డం అస్స‌లు ఉంచుకోరు. ఎప్పుడూ నీట్ షేవ్‌తో ద‌ర్శ‌న‌మిస్తారు. ఇక కొంద‌రికి గ‌డ్డం అంటేనే ఇష్టం ఉంటుంది. దీంతో వారు ఎప్పుడూ గ‌డ్డంతోనే క‌నిపిస్తారు. అయితే కొంద‌రికి మాత్రం గ‌డ్డం పెంచుకోవ‌డ‌మంటే ఇష్టం ఉంటుంది కానీ వారి గ‌డ్డం అంత త్వ‌ర‌గా పెర‌గ‌దు. దీంతో వారు నిరాశ చెందుతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన ప‌లు పొర‌పాట్ల‌ను చేయ‌కుండా ఉంటే దాంతో గ‌డ్డం త్వ‌ర‌గా పెరుగుతుంది. మ‌రి గ‌డ్డం పెంచాల‌నుకునే వారు చేసే పొర‌పాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

చాలా మంది పురుషులు నిత్యం త‌ల‌పై ఉన్న వెంట్రుక‌ల‌ను దువ్వుతారు కానీ గ‌డ్డాన్ని దువ్వ‌రు. అలాగే ఉంచుతారు. కానీ అలా చేయ‌రాదు. గ‌డ్డాన్ని నిత్యం దువ్వ‌డం వ‌ల్ల ఆ ప్రాంతంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగుప‌డి అక్క‌డ వెంట్రుక‌లు త్వ‌ర‌గా పెరుగుతాయి. దీంతో గ‌డ్డం త్వ‌ర‌గా పెరుగుతుంది. చాలా మంది గ‌డ్డాన్ని ఎప్ప‌టికప్పుడు ట్రిమ్మింగ్ చేస్తుంటారు. కానీ చేయ‌రాదు. గ‌డ్డం పెర‌గాల‌నుకునేవారు త‌ర‌చూ ట్రిమ్మింగ్ చేయ‌డం మానుకోవాలి. దీంతో గ‌డ్డం త్వ‌ర‌గా పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది. సాధార‌ణంగా కొంద‌రు పురుషులు త‌మ జుట్టు, ముఖం త‌దిత‌ర భాగాల‌కు కావ‌ల్సిన కాస్మొటిక్స్ వాడుతారు. కానీ గ‌డ్డం కోసం ఏమీ వాడ‌రు. అలా చేయ‌కూడ‌దు. గ‌డ్డం పెరిగేందుకు మార్కెట్‌లో ప‌లు కాస్మొటిక్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ట్రై చేస్తే గ‌డ్డం శుభ్రంగా ఉండ‌డంతోపాటు త్వ‌ర‌గా పెరుగుతుంది.

Beard Growth Tips

వెంట్రుక‌లు పెరిగేందుకు పోష‌కాహారం తీసుకోవ‌డం కూడా త‌ప్ప‌నిసరి అనే విష‌యాన్ని చాలా మంది మ‌రిచిపోతుంటారు. కానీ అలా చేయ‌రాదు. వెంట్రుక‌లు పెరిగేందుకు విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే నిమ్మ‌, నారింజ‌, కివీ పండ్లు, క్యాప్సికం.. త‌దిత‌ర ఆహారాల‌తోపాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ‌గా ఉండే చేప‌లు త‌దిత‌ర ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. దీంతో గ‌డ్డం కూడా త్వ‌ర‌గా పెరుగుతుంది.

కొంద‌రు త‌ల‌పై ఉండే జుట్టు కోసం ఇచ్చే షాంపూల‌ను గడ్డం కోసం వాడుతారు. కానీ అలా చేయ‌కూడ‌దు. గ‌డ్డం కోసం మార్కెట్‌లో దొరికే వ‌స్తువుల‌నే వాడాలి. షాంపూల‌ను వాడితే గ‌డ్డం త్వ‌ర‌గా పెర‌గ‌దు. కొంద‌రు నిత్యం ముఖాన్ని శుభ్రం చేసుకుంటారు కానీ గ‌డ్డాన్ని నిర్ల‌క్ష్యంగా వ‌దిలేస్తారు. అలా చేయ‌రాదు. గ‌డ్డాన్ని కూడా రోజూ శుభ్రం చేస్తేనే ఎలాంటి దుర‌ద లేకుండా అక్క‌డ వెంట్రుక‌లు బాగా పెరిగి గ‌డ్డం త్వ‌ర‌గా వ‌స్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM