Badam Burfi : బాదం పప్పులను తింటే మనకు ఎన్నో లాభాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. బాదం పప్పుల్లో ఉండే పోషకాలు మన శరీరానికి బలాన్నిస్తాయి. నీరసం, నిస్సత్తువ నుంచి బయట పడేస్తాయి. అలాగే ఇంకా ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా బాదం పప్పులను తినడం వల్ల మనకు కలుగుతాయి. ఈ క్రమంలోనే బాదం పప్పుతో తయారు చేసే బాదం పప్పు బర్ఫీ కూడా మనకు బలాన్నిస్తుంది. మరి బాదం బర్ఫీని ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
బాదం బర్ఫీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాదం పప్పు – ఒకటిన్నర కప్పు, పాలు – 1/2 లీటర్, నెయ్యి – 1/2 కప్పు, చక్కెర – 2 కప్పులు, క్రీం – 1/2 కప్పు, యాలకుల పొడి – 1/4 టీస్పూన్.
బాదం బర్ఫీ తయారు చేసే విధానం..
మొదట బాదం పప్పును 20 నిమిషాల పాటు వేడి నీటిలో నానెబెట్టాలి. అనంతరం వాటి పొట్టు తీయాలి. తరువాత వాటిని నూరి మెత్తని ముద్దగా తయారు చేసుకోవాలి. ఒక గిన్నెలో పాలు తీసుకుని మరిగించాలి. అవి బాగా మరిగి, చిక్కగా తయారయ్యాక బాదం పప్పు ముద్దను అందులో వేయాలి. ఆ తరువాత మంట తగ్గించి మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ క్రమంలో మిశ్రమం దగ్గరకు అవుతుంది. అనంతరం అందులో నెయ్యి, చక్కెర, క్రీం, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఆ తరువాత మిశ్రమం దగ్గరకు అవగానే పాత్రను దింపాలి. అనంతరం ఒక పళ్లెంలో నెయ్యి రాసి దానిపై ఆ మిశ్రమాన్ని పోయాలి. గట్టిగా అయ్యాక బర్ఫీ బిళ్లల్లా కోసుకోవాలి. దీంతో బాదం బర్ఫీ తయారవుతుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్‌తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్‌లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్‌లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్‌కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్‌లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్‌లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…