lifestyle

Apollo Fish : రెస్టారెంట్ల‌లో ల‌భించే అపోలో ఫిష్‌.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Apollo Fish : చేప‌ల‌తో మ‌నం అనేక ర‌కాల వంటకాల‌ను చేసుకోవ‌చ్చు. చేప‌ల వేపుడు, పులుసు, పులావ్‌, బిర్యానీ.. ఇలా అనేక ర‌కాల వంట‌కాల‌ను మ‌నం చేసుకుని ఆరగించ‌వ‌చ్చు. అయితే సాధార‌ణంగా మ‌న‌కు చేప‌ల‌తో చేసే అపోలో ఫిష్ రెస్టారెంట్ల‌లోనే ల‌భిస్తుంది. కానీ కొద్దిగా శ్ర‌మిస్తే.. అపోలో ఫిష్‌ను మ‌నం ఇంట్లోనే చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే అపోలో ఫిష్‌ను ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అపోలో ఫిష్ త‌యారు చేసేందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు..

క‌రివేపాకు – 2 రెమ్మ‌లు, ప‌చ్చిమిర‌ప కాయ‌లు – 3, నూనె – త‌గినంత, అల్లం, వెల్లుల్లి త‌రిగిన ముక్క‌లు – 1 టీస్పూన్, ప‌సుపు – 1/4 టీస్పూన్‌, ఎండు కారం – 1 టీస్పూన్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్‌, కోడిగుడ్డు – 1, ఆల్ ప‌ర్పోస్ ఫ్లోర్ – 1 టేబుల్ స్పూన్, కార్న్ స్టార్చ్ – 1 టేబుల్ స్పూన్, కొర్ర‌మీను చేప‌లు (ముక్క‌లు) – 250 గ్రాములు, ప‌చ్చిమిర‌ప‌కాయ‌ల‌ పేస్ట్ – 1 టేబుల్ స్పూన్, ధ‌నియాల పొడి – 1 టీస్పూన్, ఉప్పు – త‌గినంత, సోయా సాస్ – 1 టీస్పూన్, పెరుగు – 1/4 క‌ప్పు, న‌ల్ల మిరియాల పొడి – 1/2 టీస్పూన్, నిమ్మ‌రసం – 1 టేబుల్ స్పూన్.

Apollo Fish

అపోలో ఫిష్ త‌యారు చేసే విధానం..

ఒక పాత్ర‌లో చేప ముక్క‌ల‌ను తీసుకుని అందులో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, కారం పొడి, ప‌సుపు, నిమ్మ‌ర‌సం వేసి చేప ముక్క‌ల‌ను బాగా క‌ల‌పాలి. అనంత‌రం అందులో కోడిగుడ్డు కొట్టి, కార్న్ స్టార్చ్, ఆల్ ప‌ర్పోస్ ఫ్లోర్ వేసి బాగా క‌ల‌పాలి. ఆ త‌రువాత చేప ముక్క‌ల‌ను మీడియం మంట‌పై డీప్ ఫ్రై చేసుకోవాలి. అనంత‌రం ఫ్రై అయిన చేప ముక్క‌లను ప‌క్క‌న పెట్టుకోవాలి. ఆ త‌రువాత పాన్ తీసుకుని నూనె వేసి వేడెక్కాక అందులో త‌రిగిన అల్లం, వెల్లుల్లి ముక్క‌లు, ప‌చ్చిమిర‌ప కాయ ముక్క‌లు, క‌రివేపాకులు, ప‌చ్చిమిర‌పకాయ పేస్ట్‌, ధ‌నియాల పొడి, ఉప్పు, సోయా సాస్‌, పెరుగు, మిరియాల పొడి, కొత్తిమీర ఆకులు వేసి కొంత సేపు వేయించాలి. అనంత‌రం అందులో అంత‌కు ముందు ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్క‌ల‌ను వేసి బాగా వేయించాలి. అనంత‌రం ముక్క‌ల‌పై నిమ్మ‌ర‌సం పిండాలి. దీంతో రుచిక‌ర‌మైన అపోలో ఫిష్ త‌యార‌వుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఐపీఎల్ 2026 ప్రారంభంలో మార్పు.. కొత్త తేదీ ఇదే! క్లారిటీ వచ్చేది అప్పుడే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్ రెండు రోజులు ఆల‌స్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే స‌మాధానం…

Friday, 27 February 2026, 10:00 PM

విజయ్‌కు భార్య సంగీత విడాకులు.. కోర్టులో పిటిషన్ దాఖలు!

త‌మిళ న‌టుడు, టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్‌తో విడాకులు కావాల‌ని కోరుతూ ఆయ‌న భార్య సంగీత కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు…

Friday, 27 February 2026, 9:23 PM

క్రికెటర్ కాదు.. ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకున్నా: జితేష్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను మొద‌ట్లో క్రికెట‌ర్ అవుతాన‌ని అనుకోలేద‌ని, భార‌త ఆర్మీలో చేరి సేవ‌లందించాల‌ని చిన్న‌త‌నం నుంచే క‌ల‌లు క‌న్నాన‌ని, కానీ క్రికెట్‌లోకి…

Friday, 27 February 2026, 5:16 PM

మోదీకి ‘విరోష్’ వెడ్డింగ్ ఇన్విటేషన్.. మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్!

మార్చి 4, 2026న హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నున్న త‌మ వివాహ రిసెప్ష‌న్‌కు హాజ‌రు కావాల‌ని కోరుతూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని నూత‌న…

Friday, 27 February 2026, 2:58 PM

ఒక్కటైన విజయ్-రష్మిక.. ఉదయ్‌పూర్‌లో వైభవంగా ‘విరోష్’ వివాహం!

టాలీవుడ్ న‌టీన‌టులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న వివాహ బంధం ద్వారా ఒక్క‌ట‌య్యారు. గురువారం (ఫిబ్ర‌వ‌రి 26, 2026) రాజ‌స్థాన్‌లోని…

Thursday, 26 February 2026, 9:41 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ భారీ ఓటీటీ డీల్.. నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ అన్ని కోట్లా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మాస్ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీకి గాను…

Thursday, 26 February 2026, 6:59 PM

శ్రీలంక ఆటగాళ్లకు ప్రాణగండం? రక్షణ కల్పించాలని కెప్టెన్ శనక వేడుకోలు!

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్నీ సూప‌ర్ 8 ద‌శ‌లో వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల‌ను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్ర‌మించిన…

Thursday, 26 February 2026, 5:01 PM

టాలీవుడ్‌లో కొత్త రూల్.. 8 వారాల తర్వాతే ఓటీటీలోకి సినిమా..?

కొత్త‌గా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా స‌రే క‌చ్చితంగా 8 వారాల త‌రువాతే ఓటీటీలోకి రావాల‌న్న నిబంధ‌న‌పై ప్ర‌స్తుతం…

Thursday, 26 February 2026, 1:20 PM