Apple Cider Vinegar For Weight Loss : నేటి తరుణంలో అధిక బరువు సమస్య జనాలను ఏవిధంగా ఇబ్బందులకు గురి చేస్తుందో అందరికీ తెలిసిందే. అధిక బరువు కారణంగా అనేక మందికి హార్ట్ ఎటాక్స్, డయాబెటిస్ వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. దీంతో బరువును తగ్గించుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ ను వాడితే వేగంగా బరువు తగ్గవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మరి బరువును తగ్గించుకునేందుకు దీన్ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
యాపిల్ సైడర్ వెనిగర్ 2 టీస్పూన్లు, దాల్చిన చెక్క పొడి 2 టీస్పూన్లు తీసుకుని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ నీటిలో కలుపుకుని నిత్యం మూడు పూటలా తాగితే కొద్ది రోజుల్లోనే అధిక బరువు తగ్గుతారు. నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో రెండు టీస్పూన్ల తేనె, యాపిల్ సైడర్ వెనిగర్‌లను కలుపుకుని తాగితే అధిక బరువు త్వరగా తగ్గుతుంది. మీకు ఇష్టమైన ఏదైనా పండు రసాన్ని తీసి అందులో 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ ను కలిపి తాగినా బరువు తగ్గవచ్చు. నిత్యం ఇలా రెండు సార్లు తాగాలి. కానీ అందులో చక్కెర కలపరాదు.
గ్రీన్ టీ లో యాపిల్ సైడర్ వెనిగర్ ను కలుపుకుని తాగినా బరువు తగ్గవచ్చు. ఫ్రూట్ సలాడ్స్, వెల్లుల్లి రసంతో కూడా యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలిపి తీసుకోవచ్చు. దీని వల్ల అధిక బరువు త్వరగా తగ్గుతారు. యాపిల్ సైడర్ వెనిగర్‌ను పైన చెప్పిన విధంగా తాగితే కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు, మధుమేహం, గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…