Poha : చాలా మంది అటుకులను వేయించి పోపు వేసుకుని తింటారు. కొందరు వీటిని టీలో వేసి తింటుంటారు. అయితే అటుకులతో పోహా (ఉప్మా) తయారు చేసుకుని తింటే ఎంత టేస్ట్‌గా ఉంటుందో తెలుసా..? అటుకల పోహా రుచికే కాదు, మనకు ఆరోగ్యకర ప్రయోజనాలను అందించడంలోనూ మేటి అని చెప్పవచ్చు. మరి అటుకుల పోహా ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
అటుకుల పోహా తయారీకి కావల్సిన పదార్థాలు..
అటుకులు- 1 కప్పు, పచ్చిమిర్చి- 3, పెద్ద ఉల్లిపాయ – సగం, వేరుశెనగలు (పల్లీలు) – 2 టేబుల్ స్పూన్లు, పచ్చి బఠాణీలు – 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, జీలకర్ర – అర టీస్పూన్, వెల్లుల్లి ముక్కలు – అర టీస్పూన్, పసుపు – 1/4 టీస్పూన్, కొత్తిమీర – తగినంత, కరివేపాకు – 2 రెమ్మలు, నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు.
అటుకుల పోహా తయారు చేసే విధానం..
ముందుగా అటుకులను నీరు పోసి శుభ్రంగా కడగాలి. అనంతరం వాటి నుంచి నీటిని పూర్తిగా పిండి అటుకులను పక్కన పెట్టాలి. పాన్ తీసుకుని నూనె కొద్దిగా వేసి వేడి చేయాలి. జీలకర్ర, పల్లీలు, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చి బఠానీలు వేసి మరో 5 నిమిషాలు బాగా వేయించాలి. తర్వాత అటుకులు వేసి బాగా కలపాలి. చివర్లో ఉప్పు, నిమ్మరసం వేసి మరోసారి కలియబెట్టాలి. అనంతరం పోహాను కొత్తిమీరతో అలంకరించాలి. అంతే.. ఘుమ ఘుమలాడే వేడి వేడి అటుకుల పోహా తయారవుతుంది. అయితే పోహాలో పోషకాలు ఇంకా ఎక్కువ లభించాలంటే.. క్యారెట్, క్యాప్సికం తదితర కూరగాయ ముక్కలను కూడా వేసుకోవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…